రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు
హరీష్ రావు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని, త్వరలో కాంగ్రెసు కండువా కప్పుకుంటారని వంటేరు ప్రతాప రెడ్డి శనివారంనాడు అన్నారు. టీఆర్ఎస్ లో అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు.
సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మేనల్లుడు హరీష్ రావుపై కాంగ్రెసు నేత వంటేరు ప్రతాప రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మామను ఓడించాలని హరీష్ రావు తనకు ఫోన్ చేసి చెప్పారని, ఈ విషయాన్ని తాను ప్రమాణం చేసి చెబుతున్నానని ఆయన అన్నారు.
హరీష్ రావు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని, త్వరలో కాంగ్రెసు కండువా కప్పుకుంటారని వంటేరు ప్రతాప రెడ్డి శనివారంనాడు అన్నారు. టీఆర్ఎస్ లో అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు.
హరీష్ రావు తనకు అన్ నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మా మామను ఓడించాలని, మా మామ ఉన్నంత వరకు నాకు రాజకీయ జీవితం ఉండదని హరీష్ రావు చెప్పారని ఆయన అన్నారు. హరీష్ రావు తనకు కూడా టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు. తనకు ఆర్థిక సాయం చేస్తానని హరీష్ రావు చెప్పారని అన్నారు. అయితే తనకు అవినీతి సొమ్ము అక్కర్లేదని చెప్పానని ఆయన అన్నారు. 14 ఏళ్లు కష్టపడ్డానని చేతిలోకి వచ్చిన తర్వాత నా బావమరిదికి అన్నీ చేతుల్లో పెడుతున్నారని హరీష్ రావు తనతో అన్నారని ఆయన చెప్పారు. తాను ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతాప రెడ్డి చెప్పారు.
టీఆర్ఎస్ నుంచి హరీష్ రావును తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. గెలిచేవాడైతే కేసిఆర్ కుల సంఘాలతో ఎందుకు సమావేశాలు పెడుతారని ఆయన అడిగారు. గజ్వెల్ నుంచి కాంగ్రెసు అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేయనున్న విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు
టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి
సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...
భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్
హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...
కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను
హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?
పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్
నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో
టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు