బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ ని కలిశారు.  కాగా దీనిపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వేసిన సెటైర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గతంలో చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీపై దుమ్మెత్తిపోస్తూ చేసిన ట్వీట్ల స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తూ.. ‘చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకన్నా ఇంకా ఏం మాట్లడలేం’  అని క్యాప్షన్‌గా పేర్కొన్నారు. అయితే టీడీపీ-కాంగ్రెస్‌ కలయికపై ఆయా పార్టీల సొంత నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. టీడీపీ, అలాంటిది ఇప్పుడు ఇరుపార్టీలు కలిసి పనిచేయడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

కాగా..కేటీఆర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్స్ లో చంద్రబాబు కాంగ్రెస్ ని తిడుతున్నట్లుగా ఉండటం గమనార్హం.