చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ  భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్లు చేశారు

Telangana irrigation minister Harish rao sensational comments on chandrababunaidu

మెదక్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ  భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్లు చేశారు.  చంద్రబాబు.. పిచ్చి వేషాలేస్తే భవిష్యత్తులో నీ సంగతి చూస్తాం.... మా వద్ద ఉన్న రికార్డులన్నీ బయటపెడతామని హెచ్చరించారు.

ఆదివారం నాడు గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో  భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. 

కేసీఆర్ కొట్టిన దెబ్బకు  చంద్రబాబు నాయుడు అమరావతిలో పడ్డాడని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు టిక్కెట్లతో పాటు డబ్బులను కూడ బాబే సరఫరా చేస్తున్నాడని  ఆయన ఆరోపించారు. బాబు స్క్రిప్ట్‌నే  కాంగ్రెస్ నేతలు తెలంగాణలో వల్లే వేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని  తెలంగాణకు నష్టం చేయాలని చంద్రబాబునాయుడు చూస్తే  చూస్తూ ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు.దమ్ముంటే  కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబుతో తెలంగాణలో ప్రచారం చేయించాలని ఆయన సవాల్ విసిరారు. బాబు ఇదే రీతిలో వ్యవహరిస్తే  మా వద్ద ఉన్న రికార్డులను బయటపెడతామని హరీష్ రావు  హెచ్చరించారు. 

కేసీఆర్ కొట్టిన దెబ్బకు టీడీపీ కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయిందని హరీష్ రావు చెప్పారు.  తెలంగాణలో చంద్రబాబుకు ఏం పని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఏం ఉద్దరించారని  ఆయన ప్రశ్నించారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు  ఆదర్శంగా నిలిచిందన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios