Asianet News TeluguAsianet News Telugu

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

కొమరం భీమ్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ పదవికి కోనేరు కృష్ణ ఆదివారం నాడు రాజీనామా చేశారు.

koneru krishna resigns to zp vice chairman post
Author
Kagaznagar - Sirpur Road, First Published Jun 30, 2019, 2:48 PM IST


కాగజ్‌నగర్: కొమరం భీమ్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ పదవికి కోనేరు కృష్ణ ఆదివారం నాడు రాజీనామా చేశారు.


ఆదివారంనాడు  కాగజ్‌నగర్‌ మండలంలోని  సార్సాలో  ఎఫ్ఆర్ఓ అనితపై కృష్ణతో పాటు పలువురు దాడికి దిగారు. ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ అనిత తీవ్రంగా గాయపడ్డారు.ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఎఫ్ఆర్ఓపై దాడి ఘటనతో కోనేరు కృష్ణపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కృష్ణ వైస్ చైర్మెన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు పంపారు. కృష్ణ సోదరుడు సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.

తనపై వైస్ చైర్మెన్  కృష్ణ దాడికి పాల్పడినట్టు ఎఫ్ఆర్ఓ అనిత ఆరోపించారు.  ఈ విషయమై అటవీ శాఖాధికారుల పిర్యాదు మేరకు  కోనేరు కృష్ణతో పాటు  16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఎఫ్ఆర్ఓపై  దాడి ఘటనలో  సుమారు 30 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

సంబందిత వార్తలు

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)

 

Follow Us:
Download App:
  • android
  • ios