అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్పీ వైఎస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ దాడి చేయడంతో కొమరం భీం జిల్లాలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. అటవీశాఖ అధికారుల తీరుకు నిరసనగా సోమవారం ఎమ్మెల్యే అనుచరులు తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షకు దిగనున్నారు.

నిన్న దాడి జరిగిన ప్రదేశంలో అటవీశాఖ అధికారులు ఇవాళ మొక్కలు నాటేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లోనే ఐజీ నాగిరెడ్డి మకాం వేసి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.