కాగజ్ నగర్ : కాగజ్‌నగర్ మండలం సార్సాలో ఎఫ్ఆర్‌ఓ అనితపై  దాడికి దిగిన  జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కృష్ణపై చర్యలు తీసుకోవాలని  కాంగ్రెస్ పార్టీ  సిర్పూర్ కాగజ్ నగర్ ఇంచార్జీ హరీష్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం నాడు సార్సాలో  ఎఫ్ఆర్ఓ అనితపై దాడికి కృష్ణతో పాటు ఆయన అనుచరులే కారణమని  ఆయన ఆరోపించారు మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ దాడి ఘటనపై ఏం చెబుతోందని ఆయన ప్రశ్నించారు.

పోలీసుల సమక్షంలోనే ఎఫ్ఆర్ఓపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతోందని ఆయన ప్రశ్నించారు.

"