MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైద‌రాబాద్‌లో బ‌త‌కాలంటే నెల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?

హైద‌రాబాద్‌లో బ‌త‌కాలంటే నెల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?

Hyderabad: విద్య‌, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ప‌ట్ట‌ణాల బాట ప‌డుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో జీవ‌న వ్య‌యాలపై అంతర్జాతీయ గణాంక సంస్థ నంబియో మార్చి రిపోర్ట్ విడుద‌ల చేసింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 20 2026, 06:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్‌లో జీవన వ్యయం కాస్త త‌క్కువ
Image Credit : Gemini AI

హైదరాబాద్‌లో జీవన వ్యయం కాస్త త‌క్కువ

అంతర్జాతీయ గణాంక సంస్థ 'నంబియో' మార్చి 2026 రిపోర్ట్‌లో ప‌లు ఆస‌క్తికర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. హైద‌రాబాద్‌లో జీవ‌న వ్య‌యం కాస్త త‌క్కువ‌గా ఉన్న‌ట్లు ఇందులో వెల్ల‌డైంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో అద్దెలు తక్కువగా ఉండటం ప్రధాన కారణం. ఇక్కడ కాస్ట్ ఇండెక్స్ 21.1గా ఉండగా, రెంట్ ఇండెక్స్ కేవలం 5.6 పాయింట్ల వద్ద ఉండటం విశేషం. దీంతో ఒక వ్యక్తి అద్దెను మినహాయిస్తే నెలకు సుమారు రూ.12 వేల నుంచి రూ.50 వేల మధ్య ఖర్చుతో జీవించగలుగుతున్నాడు. ఇదే పరిస్థితి ముంబై లేదా ఢిల్లీలో ఉండదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
కొనుగోలు శక్తిలో హైదరాబాద్ ముందంజ
Image Credit : Getty

కొనుగోలు శక్తిలో హైదరాబాద్ ముందంజ

హైదరాబాద్‌లో నివసించే వారికి ఉన్న మరో ప్లస్ పాయింట్ కొనుగోలు శక్తి. సుమారు 154 పాయింట్లతో ఇది దేశంలోని మెట్రో నగరాల్లో అగ్రస్థానంలో ఉంది. అంటే ఇక్కడ సంపాదించే డబ్బుతో ఇతర నగరాల కంటే ఎక్కువ సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. అందుకే ఐటీ ఉద్యోగులు, యువ కుటుంబాలు హైదరాబాద్ వైపు ఆకర్షితులవుతున్నారు. దేశవ్యాప్తంగా పెరిగిన ఖర్చులు… మధ్యతరగతికి భారంగా మారుతున్నాయి. నింబో విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం, 2026 నాటికి దేశంలో జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. అద్దెలు, రోజువారీ అవసరాల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది. మెట్రో నగరాల్లో ఒక వ్యక్తి అద్దె లేకుండానే నెలకు దాదాపు రూ.27,000కు పైగా ఖర్చు అవుతోంది. అదే న‌లుగురుతో కూడిన కుటుంబానికి సుమారు రూ.98,000 అవసరం అవుతోంది.

Related Articles

Related image1
EV Scooter: కారులో ఉండే ఫీచర్లు స్కూటీలో ఉన్నాయేంటీ భయ్యా.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Related image2
కేడీ ది డెవిల్ సినిమాకు, ఎన్టీఆర్ హీరోయిన్‌కి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఎందుకు ట్రెండ్ అవుతోంది.
35
అద్దెల విషయంలో ముంబై టాప్
Image Credit : Gemini AI

అద్దెల విషయంలో ముంబై టాప్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అద్దెల భారమే పెద్ద సమస్యగా మారింది. ఒక సాధారణ ఇల్లు తీసుకోవాలంటేనే భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అదే పరిస్థితి బెంగ‌ళూరు, ఢిల్లీ నగరాల్లో కూడా కనిపిస్తోంది. నగర కేంద్రాల్లో నివసించాలంటే కుటుంబ ఆదాయంలో పెద్ద భాగం అద్దెకు వెళ్లిపోతుంది.

45
నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి
Image Credit : X

నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి

నెల‌వారి ఖ‌ర్చులో అద్దెలే కాదు, రోజువారీ అవసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. పాలు, బియ్యం, బ్రెడ్ వంటి వస్తువుల ధరలు పెరగడంతో వంటింటి ఖర్చు గణనీయంగా పెరిగింది. దీనికి తోడు పెట్రోల్ ధరలు కూడా అధికంగా ఉండటంతో రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. సొంత వాహనం ఉన్నవారికి ఇది మరింత భారంగా మారింది.

55
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్, పుణె, కోల్‌కతా కొంత ఊరట
Image Credit : Getty

ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్, పుణె, కోల్‌కతా కొంత ఊరట

ఖర్చులు అధికంగా ఉన్న మెట్రోల మధ్య హైద‌రాబాద్‌, పుణె, కోల్‌క‌తా నగరాలు కొంతవరకు సౌకర్యవంతమైన జీవనాన్ని అందిస్తున్నాయి. ప్రత్యేకంగా కోల్‌కతా తక్కువ ఖర్చుతో జీవించగల నగరంగా నిలుస్తోంది. పుణెలో జీవన నాణ్యత మెరుగ్గా ఉండగా, హైదరాబాద్‌లో ఆదాయం ఖర్చుల సమతుల్యత కనిపిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: గుడ్ న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్.. ఈ ప్రాంతాలన్ని మారిపోతాయి !
Recommended image2
Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
Recommended image3
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు.. ఇక ఉద్యోగులకూ సెలవులే సెలవులు
Related Stories
Recommended image1
EV Scooter: కారులో ఉండే ఫీచర్లు స్కూటీలో ఉన్నాయేంటీ భయ్యా.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Recommended image2
కేడీ ది డెవిల్ సినిమాకు, ఎన్టీఆర్ హీరోయిన్‌కి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఎందుకు ట్రెండ్ అవుతోంది.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved