కాగజ్‌నగర్  :  సార్సాలో ఎఫ్ఆర్ఓ అనితపై కొమర్ భీమ్  జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్  కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడడడాన్ని రాష్ట్ర మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి  తీవ్రంగా ఖండించారు.

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన  చర్యలు తీసుకొంటామని  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.  ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని... ఇలా అధికారులపై దాడులు చేయడం సరైందికాదని మంత్రి అభిప్రాయపడ్డారు.

అదివారం నాడు సార్సాలో మొక్కలు నాటేందుకు భూమిని చదును చేస్తున్న ఫారెస్ట్ అధికారులను కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. 

సంబంధిత వార్తలు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)