కొమరంభీం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ.. అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశాడు. సిర్సాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రత్యామ్నాయ అటవీకరణ పనులను పర్యవేక్షించేందుకు అటవీ రేంజ్ ఆఫీసర్ అనిత, తన సిబ్బందితో కలిసి వెళ్లారు.

అయితే వీరిని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోనేరు కృష్ణ వందలాది మంది సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. అనితతో పాటు సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె తీవ్ర గాయాలు పాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.

"