హైదరాబాద్: వైఎస్ చైర్మన్ కోనేరు కృష్ణ, అతని అనుచరులు తనపై చేసిన దాడిని గుర్తు చేసుకుంటూ తెలంగాణ అటవీ శాఖ మహిళా అధికారి ఏడ్చేశారు. కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాలో ఆ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందారు. 

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనిత మీడియాతో మాట్లాడారు. కఠినమైన శ్రమ చేసి తాను ఈ స్థాయికి వచ్చానని, ప్రభుత్వ పాఠశాలలో చదివానని, సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని ఆమె చెప్పారు. తన యూనిఫాంను తాను గౌరవిస్తానని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే యూనిఫాం ధరించానని ఆమె అన్నారు. 

తనపై దారుణంగా దాడి చేశారని, దీన్ని తాను ఖండిస్తున్నానని అనిత చెప్పారు. దాడి సంఘటనపై కోనేరు కృష్ణ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కోనేరు కృష్ణ స్థానిక శాసనసభ్యుడు కోనేరు కోనప్ప సోదరుడు కూడా. 

అనితపై దాడి సంఘటనను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఖండించారు. సంఘటనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా తీవ్రంగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత

ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)