కాగజ్‌నగర్:ఎఫ్ఆర్ఓ అనితపై దాడికి పాల్పడిన ఘటనలో కొమురం భీమ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్‌ కోనేరు కృష్ణ  సహా ఆయన అనుచరులపై పోలీసులు  కేసు నమోదు చేశారు.
.   ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఆదివారం నాడు  కాగజ్‌నగర్‌ మండలం సార్సాలో  మొక్కలు నాటేందుకు ట్రాక్టర్లతో చదును చేస్తున్న సమయంలో  కొమరం భీమ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కృష్ణ తన అనుచరులతో కలిసి  ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారు.

ఫారెస్ట్ అధికారులే తమపై దాడికి దిగారని కృష్ణ ఎదురు దాడి చేశారు.  అయితే తనపై కృష్ణ దాడికి దిగాడని ఎఫ్ఆర్ఓ అనిత ఆరోపించారు. అటవీ శాఖాధికారుల ఫిర్యాదు మేరకు కృష్ణతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.  ఈటనలో కృష్ణతో పాటు ఆయన అనుచరులు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.. మరో వైపు జిల్లా  పరిషత్ వైఎస్ చైర్మెన్ పదవికి  కృష్ణ రాజీనామా చేశారు. 

సంబంధిత వార్తలు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)