MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Ramzan Holidays : మారిన రంజాన్ సెలవులు.. ఒకటి కాదు రెండ్రోజులు హాలిడేసే

Ramzan Holidays : మారిన రంజాన్ సెలవులు.. ఒకటి కాదు రెండ్రోజులు హాలిడేసే

Ramzan Holidays : ఆంధ్ర ప్రదేశ్ లో రంజాన్ సెలవు మారింది. హాలిడే క్యాలెండర్ ప్రకారం కాకుండా ఓరోజు ఆలస్యంగా సెలవు వస్తోంది… దీంతో రెండ్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి,   

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 20 2026, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వరుసగా రెండ్రోజులు సెలవులే
Image Credit : Gemini AI

వరుసగా రెండ్రోజులు సెలవులే

Ramzan Holidays : ఆంధ్ర ప్రదేశ్ లో రంజాన్ సెలవు మారింది. 2026 హాలిడే క్యాలెండర్ ప్రకారం రంజాన్ హాలిడే మార్చి 20న శుక్రవారం అంటే ఇవాళ ఉంది... కానీ దీన్ని ప్రభుత్వం మార్చేసింది. దేశవ్యాప్తంగా మార్చి 21 రంజాన్ వేడుకలు జరుపుకోనున్నారు... అందుకే ఇవాళ్టి సెలవును రేపేటికి మార్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు యధావిధిగా నడిచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వరుసగా రెండ్రోజులు సెలవే..
Image Credit : Getty

వరుసగా రెండ్రోజులు సెలవే..

ముందుగా ప్రకటించినట్లు ఇవాళ (మార్చి 20న) రంజాన్ ఉంటే రేపు (మార్చి 21న) యధావిధిగా ఆఫీసులు, స్కూళ్ళు నడిచేవి. కానీ ఈ సెలవు మారడంవల్ల ఒక్కరోజు సెలవులు కాస్త రెండ్రోజులుగా మారాయి. శనివారం (మార్చి 21న) రంజాన్ సెలవు కాగా మార్చి 22న ఎలాగూ ఆదివారమే కాబట్టి మరో సెలవుల కలిసివస్తుంది. దీంతో పండగను జరుపుకున్నవారు తర్వాత రోజు విశ్రాంతి తీసుకోడానికి వీలుంటుంది. 

34
తెలంగాణలో యధావిధిగా రంజాన్ సెలవులు..
Image Credit : Getty

తెలంగాణలో యధావిధిగా రంజాన్ సెలవులు..

తెలంగాణలో రంజాన్ సెలవులు యధావిధిగా కొనసాగనున్నాయి. ముందుగా ప్రకటించిన హాలిడే క్యాలెండర్ ప్రకారమే మార్చి 21 (శనివారం) సెలవు ఉంది. తర్వాత రోజు అంటే మార్చి 22న కూడా ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. కానీ ఆ అవసరం లేకుండానే ఆదివారం సాధారణ సెలవు వస్తోంది. ఇలా తెలంగాణలో కూడా రాబోయే రెండ్రోజులు వరుసగా సెలవులు వస్తున్నాయి.

44
మార్చి 27న మరో సెలవు...
Image Credit : Getty

మార్చి 27న మరో సెలవు...

ఈ వీకెండ్ ఉగాది, రంజాన్ సెలవులతో ముగుస్తుంది. ఇక తర్వాత వీకెండ్ కూడా లాంగ్ వీకెండ్ గా మారనుంది. మార్చి 27 (శుక్రవారం) శ్రీరామ నవమి పండగ ఉంది... కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అధికారిక సెలవు ఉంటుంది. ఇక శని, ఆదివారం ఎలాగూ ఉద్యోగులకు సెలవు ఉంటుంది... ఇలా మూడురోజులు సెలవులు వస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
Recommended image2
Now Playing
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
Recommended image3
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?
Related Stories
Recommended image1
Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?
Recommended image2
Ramadan Charity ఇది కదా రంజాన్ పుణ్యం అంటే.. పిల్లల కోసం రూ.లక్షలు వెచ్చించిన టీచర్లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved