హైదరాబాద్ : స్వలింగ సంపర్కులే అతడి టార్గెట్... అబ్బాయిలను గదిలోకి తీసుకెళ్లి నగ్నంగా...

స్వలింగ్ సంపర్కులే టార్గెట్ గా భారీ మోసాలకు పాల్పడుతున్న ఓ రౌడీ షీటర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. 

Rowdy sheeter blackmailed gay partners in Hyderabad AKP

హైదరాబాద్ : హోమో సెక్స్ అంటే ఇష్టపడే అబ్బాయిలే అతడి టార్గెట్. వివిధ గే యాప్ ల ద్వారా అలాంటి యువకులతో పరిచయం పెంచుకుని మాయమాటలతో నమ్మించేవాడు. వారి కోరిక తీరుస్తానంటూ తన గదికి పిలిపించుకుని ప్రేమను ఒలకబోస్తూ నగ్నంగా మార్చి ఫోటోలు, వీడియో చిత్రీకరించేవాడు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు  ఇలా స్వలింగ సంపర్కులను లైంగికంగా వేధిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న రౌడీషీటర్ అరాచకాలు తాజాగా బయటపడ్డాయి. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని బోలానగర్ కు చెందిన అఫ్రిది రౌడీ షీటర్. అతడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు వున్నాయి. అతడి అరాచకాలు రోజురోజుకు ఎక్కువ కావడంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసారు. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. అయితే ఈసారి రౌడీయిజంతో కాకుండా కొత్తగా బ్లాక్ మెయిల్ చేయడంద్వారా ఈజీ మనీ సంపాదించాలని అనుకున్నాడు. ఇందుకోసం స్వలింగ సంపర్కులను టార్గెట్ చేసాడు. 

వివిధ గే యాప్స్ ద్వారా స్వలింగ సంపర్కం ఇష్టపడే యువకులతో అఫ్రిది పరిచయం పెంచుకునేవాడు. వారిని తన మాటలతో నమ్మించి ఏకాంతంగా కలుద్దామంటూ వారిని తన గదికి తీసుకెళ్లేవాడు. తన చేష్టలతో వారిలో కోరికలు పెంచి నగ్నంగా మార్చేవాడు. ఈ సమయంలో స్నేహితుడు హరూన్(22) సహాయంతో ఫోటోలు, వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత ఈ నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసి అందినకాడికి డబ్బులు దండుకునేవారు.  

Read More  ఆమె తెలివికి పోలీసులే షాక్: మద్యం తాగించి, మటన్ పెట్టి, వీడియో తీసి..

ఇలా ఇప్పటివరకు అనేకమంది యువకులను మోసం చేసిన అఫ్రిది ఇటీవల ఇద్దరు యువకులను ఇలాగే దోచుకున్నారు. తన గదికి తీసుకెళ్లి నగ్న వీడియోలు తీసి బెదిరించి నగదుతో పాటు బంగారాన్ని దోచుకున్నారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అఫ్రిది వ్యవహారం బయటపడింది. 

ఇద్దరు యువకుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అఫ్రిది, హరూన్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటివరకు చాలామంది వీరి బారినపడి మోసపోయాయినట్లు సమాచారం. వారి వివరాలను సేకరించడానికి దర్యాప్తు చేపట్టారు. వీరి బాధితులు భయపడకుండా ముందుకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios