చౌటుప్పల్: వివాహిత స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా తన సెల్‌ఫోన్‌లో  చిత్రీకరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు  రంగయ్య అనే  వ్యక్తి.  అంతేకాదు ఈ వీడియోలను  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఈ విషయం బాధితురాలికి తెలిసి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకొంది.

యాదాద్రి భువనగిరి జిల్లా  చౌటుప్పల్ మండలంలోని పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన ఓ వివాహిత  స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన  ఉప్పుతోట రంగయ్య అనే  వ్యక్తి  ఆ వీడియోలను చిత్రీకరించాడు.

ఈ వీడియోలను బాధితురాలికి చూపించి పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.  అంతేకాదు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన సమయంలో ఆమెకు తెలియకుండా మరికొన్ని వీడియోలను చిత్రీకరించాడు. 

అయితే ఆ వివాహితతో తాను సన్నిహితంగా ఉన్న వీడియోలతో పాటు ఆమె స్నానం చేస్తున్న వీడియోలను  నిందితుడు  తన స్నేహితులకు చూపించాడు. అంతేకాదు  వాటిని  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం బాధితురాలికి తెలిసింది. బాధితురాలు చౌటుప్పల్ పోలీసులను ఆశ్రయించింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడిని అరెస్ట్ చేశారు. 

ఈ వార్తలు చదవండి

ఆర్నెళ్ల క్రితం లవ్ మ్యారేజ్: పుట్టింట్లో ఉన్న భార్యను చంపిన భర్త

ట్విస్ట్: కోర్కె తీర్చలేదని భార్యపై దాడి, పోలీసులకు షాకిచ్చిన భార్య

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య
రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు