భార్య, భర్తల మధ్య గొడవలు పడడం ఆ తర్వాత సర్ధుకుపోవడం మామూలే.అయితే గుంటూరు జిల్లాలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకొంది.తన కోరిక తీర్చలేదని భార్యపై ఓ భర్త కత్తిపీటతో భార్యపై దాడి చేశాడు.  దీంతో ఆమెకు వీపు కింది భాగంలో  గాయాలయ్యాయి.


గుంటూరు: భార్య, భర్తల మధ్య గొడవలు పడడం ఆ తర్వాత సర్ధుకుపోవడం మామూలే.తన కోరిక తీర్చలేదని భార్యపై ఓ భర్త కత్తిపీటతో భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమెకు వీపు కింది భాగంలో గాయాలయ్యాయి. అయితే ఈ దాడికి పాల్పడిన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో బాధితురాలు పోలీసులపై మండిపడింది. ఫిర్యాదు చేయకుండానే తన భర్తను ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను ఆమె నిలదీసింది.ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకొంది.

గుంటూరు జిల్లాలోని వడ్డేశ్వరంలో నివాసం ఉండే దంపతుల మధ్య ఆదివారం నాడు ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకొంది. తన కోరిక తీర్చాలని భర్త భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహం పట్టలేక అతను ఆమెపై కత్తిపీటతో దాడి చేశాడు.

దీంతో బాధితురాలి వీపు కింది భాగంలో గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స చేయించారు. 15 కుట్లు వేశారు. అయితే భార్యపై కత్తిపీటతో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

అయితే ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే తన భర్త గురించి బాధితురాలు ఆరా తీసింది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని బంధువులు చెప్పడంతో ఆమె హుటాహుటిన ఆసుపత్రి నుండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. 

ఫిర్యాదు చేయకుండానే ఎలా తన భర్తను అరెస్ట్ చేశారంటూ ఆ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ విషయమై కేసులు పెట్టుకొని పరువు తీసుకోవాలని అని ప్రశ్నించింది.అయితే ఈ ఘటనలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారోననేది ఆసక్తిగా మారింది.

ఈ వార్త చదవండి

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అఫైర్: పెళ్లయ్యాక ప్రియుడితో జంప్, వద్దన్న భర్తకు షాక్