హైదరాబాద్:హైద్రాబాద్‌ సైనిక్ పురిలో ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని ప్రేమించి సహాజీవనం చేస్తున్న విషయం ప్రియురాలికి తెలియడంతో మనోవేదనకు గురైన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్ సైనిక్‌పురిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సునీత కొంత కాలంగా నర్సుగా పనిచేస్తోంది. అదే  ఆసుపత్రిలో పనిచేసే మనోహార్ అనే యువకుడిని ప్రేమించింది.

వీరిద్దరూ కూడ ఏఎస్‌రావు నగర్ లో  ఓ గదిని అద్దెకు తీసుకోని సహాజీవనం చేస్తున్నారు. మనోహార్ కు అంతకు ముందే వివాహమైంది. ఈ విషయాన్ని దాచిపెట్టి సునీతతో అతను సహాజీవనం చేస్తున్నాడు. 

అయితే ఇటీవల ఈ విషయం ఆమెకు తెలిసింది. దీంతో మనోహార్  ను ఆమె నిలదీసింది.ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన సునీత తాను ఆత్మహత్య  చేసుకొంటున్నానని మనోహర్ కు ఫోన్ చేసి చెప్పింది.

మనోహర్ సునీత అద్దెకు ఉంటున్న గది తలుపులు పగుల గొట్టి చూడగా అప్పటికే ఆమె కొనఊపిరితో ఉంది.  ఆసుపత్రిలో చేర్పించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.సునీత ఆత్మహత్యకు కారణమైన మనోహార్ ను పోలీసులు అరెస్ట్  చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అఫైర్: పెళ్లయ్యాక ప్రియుడితో జంప్, వద్దన్న భర్తకు షాక్