నల్గొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మల్లెపల్లివారిగూడెంలో ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్యను  భర్త హత్య చేశాడు. నిందితుడు పారిపోయాడు.  అబార్షన్ చేసుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు.. అయితే ఆమెక అందుకు ఒప్పుకోకపోవడంతో భర్త శ్రీనివాస్ భార్య ఆసియాను సోమవారం సాయంత్రం హత్య చేశాడు.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని మల్లెపల్లివారిగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్, ఆసియాలు ఐదేళ్లుగా ప్రేమించుకొన్నారు. అయితే  ఆరు మాసాల క్రితం పెళ్లి చేసుకోవాలని ఆసియా ఒత్తిడి తేవడంతో శ్రీనివాస్ తప్పించుకు తిరిగాడు. అయితే దీంతో శ్రీనివాస్ ఇంటి ముందు ఆసియా బైఠాయించి ఆందోళనకు దిగింది.

జిల్లాలోని మహిళా సంఘాలు, పలు రాజకీయపార్టీలు ఆసియాకు మద్దతుగా నిలవడంతో  శ్రీనివాస్ ఆసియాను పెళ్లి చేసుకొన్నాడు.  అయితే ఇటీవల ఆసియా గర్భం దాల్చింది. వారం రోజులుగా అబార్షన్ చేసుకోవాలని శ్రీనివాస్ ఆసియాపై ఒత్తిడి తెస్తున్నాడు.

ఆసియా మాత్రం  అబార్షన్ చేసుకొనేందుకు మాత్రం నిరాకరించింది.  ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. అదే గ్రామంలోని తన పుట్టింటికి ఆసియా వెళ్లిపోయింది.  అయితే ఇవాళ ఇంట్లో ఒంటరిగా ఆసియా ఉన్న విషయాన్ని శ్రీనివాస్ తెలుసుకొన్నాడు.

అబార్షన్ విషయమై భార్య, భర్తలు గొడవపెట్టుకొన్నారు.  అబార్షన్‌కు ఆసియా ఒప్పుకోలేదు. దీంతో అక్కడే ఉన్న  కత్తితో  ఆసియా గొంతు కోసి శ్రీనివాస్ చంపేశాడు.  ఆ తర్వాత అతను పారిపోయాడు.  ఆసియా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ వార్తలు చదవండి

ట్విస్ట్: కోర్కె తీర్చలేదని భార్యపై దాడి, పోలీసులకు షాకిచ్చిన భార్య

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు