చెడుదారులవైపు వెళ్తున్న విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి.. మంచి మార్గంలో నడిచేలా దిశానిర్దేషం చేయాల్సిన ఓ పంతులే దారి తప్పాడు. కీచకుడిలా.. మహిళా టీచర్లపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన స్కూల్లో పనిచేసే మహిళా టీచర్ కి మత్తు మందు ఇచ్చి.. తన కామ కోరికలు తీర్చుకునేవాడు. కాగా... తాజాగా ఆ కీచక ప్రిన్సిపల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read తండ్రి రెండో పెళ్లి... పిల్లలకు పాచిపోయిన అన్నం, వాతలు పెడుతూ..

హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పరిధిలో మహా గ్నాన స్కూల్ ప్రిన్సిపల్ గా సయీద్ అయుబ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతనికి అప్పటికే వివాహమైంది. అయినప్పటికీ అతనికి శృంగార కోరికలు కాస్త ఎక్కువ. ఈ నేపథ్యంలోనే తన స్కూల్లో పనిచేసే ఓ మహిళా టీచర్ కి వలపు వల విసిరాడు. మాయమాటలు చెప్పి తన వలలో పడేలా చేసుకున్నాడు.

అక్కడితో ఆగకుండా సదరు మహిళా టీచర్ కి ప్రేమ పాఠాలు చెప్పి.. తనతో బయటకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్నంతటినీ వీడియో తీసి.. వాటని బయటపెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ భయంతో సదరు మహిళా టీచర్ ప్రిన్సిపల్ ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

కాగా...ఈ విషయంలో ఆ మహిళా టీచర్ తల్లిదండ్రులకు కూడా తెలిపిపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సదరు టీచర్ కూడా అతనిపై ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.