వాళ్లు అభం, శుభం తెలియని చిన్నారులు. లోకం పోకడ ఎరగని ఆ చిన్నారులు తల్లిని కోల్పోయారు. దీంతో తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పిల్లలకు ఓ తల్లి దొరుకుతుందిలే అని అతను ఆశపడ్డాడు.కానీ ఆ సవతి తల్లి మాత్రం పిల్లలకు నరకం చూపించింది. 

చిన్నారులనే జాలి కూడా లేకుండా ప్రవర్తించింది. పాచిపోయిన అన్నాన్ని భోజనంగా పెడుతూ... ఒంటికి వాతలు పెట్టేది. వీరి బాధలు చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read అన్న కూతురిని కిడ్నాప్ చేసి... అత్యాచారం...

చిలకలగూడ మైలార్ గడ్డలో ఎన్వీఎస్ గల్లీకి చెందిన మద్దూరి లక్ష్మణ్(39) కి పెళ్లై భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఇటీవల భార్య రోజా కన్నుమూసింది. లక్ష్మణ్ ముగ్గురు చిన్నారులు సంజన(9), సందీప్(7), భరత్ చారి(5)లు సీతాఫల్ మండిలోని వీరామాచేనని పగడయ్య స్కూల్ లో చదువుతున్నారు. కాగా..  భార్య చనిపోవడంతో మధుమతి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత రెండో భార్యకు బాబు(సంవత్సరం)పుట్టాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సవతితల్లి ముగ్గురు పిల్లలకు నరకయాతన చూపించింది. మిగిలి పోయిన పాచి అన్నం పెట్డడంతోపాటు ఇంట్లో బట్టలు ఉతికించటం, ఇళ్లు ఉడ్పించటం, అంట్లు తోమించడం చేయించింది. పిల్లలను చిత్రహింసలకు గురిచేయటంతోపాటు నిత్యం వేధించేది. 

శాడిస్టులా మారిన సవతితల్లి ముగ్గురు పిల్లలకు నిత్యం కాల్చి వాతలు పెట్టేది. బాధలు భరించలేని చిన్నారులు నిత్యం పెద్ద అరుపులతో ఏడుస్తూ ఉండేవారు. సవతి తల్లి పిల్లలను పెట్టే బాధలు స్థానికులు గమనించారు. వారు ఆ చిన్నారుల బాధను చూసి చలించిపోయి పోలీసులకు సమాచారం అందించారు. విషయమంతా తెలుసుకునన పోలీసులు మధుమతి, లక్ష్మణ్ లను అదుపులోకి తీసుకున్నారు.  చిన్నారులను హైదరాబాద్ జిల్లా చైల్డ్ హోమ్ కి తరలించారు.