దేవరకద్ర: మహాబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో అదృశ్యమైన  యువకుడు నాగరాజు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగా నాగరాజును  హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మృతదేహాన్ని కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

మహాబూబ్ నగర్ జిల్లీ  దేవరకద్ర మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, చెన్నకేశవులు అదే గ్రామానికి చెందిన వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయమై వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. 

ఈ విషయం అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అనే యువకుడికి తెలిసింది. నాగరాజు,  చెన్నకేశవులు వివాహేతర సంబంధం పెట్టుకొన్న మహిళ  శ్రీకాంత్‌కు సమీప బంధువు.  దీంతో  వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని శ్రీకాంత్ నాగరాజును హెచ్చరించాడు.  అయినా  నాగరాజు మాత్రం తన పద్దతిని మార్చుకోలేదు.  దీంతో నాగరాజును చంపేయాలని  అతను ప్లాన్ చేశాడు.

నాగరాజును చంపేందుకు  చెన్నకేశవులును సహాయం చేయాలని అడిగాడు. దీనికి చెన్నకేశవులు కూడ అంగీకరించాడు. సెప్టెంబర్ 9వ తేదీన  రాత్రి నాగరాజును మాటల్లో పెట్టి గ్రామ సమీపంలోని  వాగులోకి  నాగరాజును  తీసుకెళ్లారు.  వివాహేతర సంబంధం  విషయమై నాగరాజును  నిలదీశారు. దీంతో వీరి మధ్య తీవ్ర గొడవ జరిగింది.

తనపై దాడి చేస్తారని భావించిన నాగరాజు ... చెన్నకేశవులు...శ్రీకాంత్ కళ్లలో ఇసుకను కొట్టి పారిపోయాడు. అయితే  అతడిని వీరిద్దరూ వెంటాడి కత్తితో పొడిచారు.  తలను, మొండాన్ని వేరు చేసి వాగులో వేర్వేరు చోట్ల పూడ్చివేశారు. అయితే సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం వాగులో గుర్తు తెలియని మృతదేహం కన్పించడంతో పోలీసులకు సమాచారం అందింది.

అయితే నాగరాజు కన్పించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును చేపట్టారు. అయితే ఈ మృతదేహం నాగరాజుదేనని తేల్చారు. మరోవైపు వృతదేహాన్ని వెలికితీయకుండా పోలీసులను గ్రామస్తులు అడ్డుకొన్నారు.  అయితే పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి మృతదేహన్ని వెలికితీశారు.

అయితే నాగరాజుకు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని తెలుసుకొన్న పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారు. చెన్నకేశవులు, శ్రీకాంత్‌లను అదుపులోకి  తీసుకొని  విచారణ చేశారు. వీరిద్దరూ కూడ  నాగరాజును చంపినట్టుగా ఒప్పుకొన్నారు.

ఈ  వార్తలు చదవండి

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య