Asianet News TeluguAsianet News Telugu

2018 ఈయర్ రౌండప్: కమ్యూనిష్టులకు కలిసి రాలేదు

 2018  సంవత్సరం లెఫ్ట్ పార్టీలకు కలిసి రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  సీపీఐ, సీపీఎం‌కు  ఒక్క సీటు దక్కలేదు. 

left parties not got single seat in telangana assembly elections 2018
Author
Hyderabad, First Published Dec 20, 2018, 6:24 PM IST

హైదరాబాద్: 2018  సంవత్సరం లెఫ్ట్ పార్టీలకు కలిసి రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  సీపీఐ, సీపీఎం‌కు  ఒక్క సీటు దక్కలేదు. 2014 ఎన్నికల్లో  ఈ రెండు పార్టీలు చేరో స్థానంలో విజయం సాధించిన విషయం తెలిసిందే.

నిర్ణీత కాల వ్యవధి కంటే   ముందుగానే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో ఈ ఏడాది (2018) డిసెంబర్ ఏడో తేదీన ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో  టీఆర్ఎస్  భారీ మెజారిటీతో  రెండోసారి అధికారంలోకి వచ్చింది. 

ఈ ఎన్నికల సమయంలో  సీపీఐ, సీపీఎం వేర్వేరు కూటముల్లో ఉన్నాయి. టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్‌లతో కలిసి సీపీఐ ప్రజా కూటమిగా ఏర్పడ్డాయి. ప్రజా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య ఒప్పందం మేరకు సీపీఐ మూడు స్థానాల్లోనే పోటీ చేయాల్సి వచ్చింది.

కనీసం ఐదు స్థానాలు కావాలని  సీపీఐ పట్టుబట్టింది. కానీ, జాతీయ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూడు సీట్లతోనే ఆపార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేసింది.

హుస్నాబాద్ నుండి సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, బెల్లంపల్లి నుండి  మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, వైరా నుండి బానోతు విజయ పోటీ చేశారు.కానీ, ఈ మూడు స్థానాల్లో సీపీఐ విజయం సాధించలేదు.

ఇక సీపీఎం బీఎల్ఎఫ్  పేరుతో  ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్  పేరుతో  పలు ప్రజా సంఘాలు, పార్టీలతో బీఎల్ఎఫ్ ఏర్పాటు చేసింది సీపీఎం. 90 శాతంగా ఉన్న బహుజనులకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఇచ్చే దిశగా ఈ ఫ్రంట్  ప్రయత్నాలు చేసింది. కానీ బీఎల్ఎఫ్ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు.

సుమారు 81 స్థానాల్లో బీఎల్ఎఫ్ పేరుతో  సీపీఎం పోటీ చేసింది. అయితే బీఎల్ఎఫ్ కు 1,41,119 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోలైన ఓట్లలో 0.7 శాతం మాత్రమే ఆ పార్టీకి దక్కాయి.

2014 ఎన్నికల్లో సీపీఎం 26 స్థానాల్లో  సీపీఎం పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో  సీపీఎం భద్రాచలం స్థానంలో విజయం సాధించింది. ఈ దఫా ఈ స్థానంలో కూడ ఆ పార్టీ ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో సీపీఎంకు 88,733 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో ఆ పార్టీకి 0.4 శాతం మాత్రం దక్కాయి.

కానీ, ఈ దఫా ఎక్కువ సీట్లలో పోటీ చేసినా కూడ ఆశించిన ప్రయోజనం కూడ లేకపోయింది. 2016-17లో ఆరు మాసాలకు పైగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర నిర్వహించారు. కానీ, ఈ పాదయాత్ర కూడ ఆ పార్టీకి కలిసి రాలేదు.

సీపీఐ, సీపీఎంలు కూడ వేర్వేరుగా పోటీ చేశాయి.  లాల్ -నీల్‌ కమ్యూనిష్టులు, బహుజనులు  కలిసి పోటీ చేసినా  కూడ  సీపీఎంకు ప్రయోజనం  దక్కలేదు.గత ఎన్నికల్లో  సీపీఐ దేవరకొండ నుండి పోటీ చేసి విజయం సాధించింది. అయితే  రెండేళ్ల క్రితం సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కూడ టీఆర్ఎస్ లో చేరారు. ఈ దఫా మరోసారి అదే స్థానం నుండి రవీంద్రకుమార్  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

మరోవైపు కమ్యూనిష్టుల సంప్రదాయ ఓట్లు కూడ చెదిరిపోయాయి. ఈ పరిస్థితిపై కూడ ఉభయ కమ్యూనిష్లు పార్టీలు అంతర్మధనంలో పడ్డాయి.  ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో  ఈ రెండు పార్టీలకు అసెంబ్లీలో  ఒక్క సీటు కూడ లేదు. ఈ దఫా తెలంగాణ అసెంబ్లీలో ఉభయ కమ్యూనిష్టు పార్టీలకు ఒక్క సీటు కూడ దక్కలేదు. ఈ పరిణామాలపై  కమ్యూనిష్టు పార్టీలు ఆంతర్మథనంలో పడ్డాయి.

సంబంధిత వార్తలు

సీపీఐ జాబితా విడుదల, ముగ్గురు అభ్యర్థుల ప్రకటన

దిగొచ్చిన సీపీఐ: మూడు సీట్లు, రెండు ఎమ్మెల్సీలకు సర్ధుబాటు

కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్...సీపీఐ తాడోపేడో

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభ

 

 

Follow Us:
Download App:
  • android
  • ios