హైదరాబాద్: సీపీఐ పార్టీ అభ్యర్థులను ఎట్టకేలకు ప్రకటించింది. మహాకూటమిలో పొత్తులో భాగంగా మూడు సీట్లకు ఒప్పందం కుదుర్చుకున్న సీపీఐ మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. హుస్నాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి,  బెల్లంపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా గుండా మల్లేష్, వైరా నియోజకవర్గ అభ్యర్థిగా బానోతు విజయభాయ్ లను ప్రకటించింది. 

సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఐదు సీట్లు కావాలంటూ సీపీఐ పట్టుబట్టింది. ఆఖరికి నాలుగు స్థానాలు అయినా ఒకే అని ప్రకటించింది.  అయితే సీట్ల సర్ధుబాటు ఎప్పటికీ తేలకపోవడంతో సీపీఐ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమైన సీపీఐ జాతీయ నాయకత్వం మూడు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఒప్పందంలో భాగంగా రాష్ట్ర నాయకత్వం మూడు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. రెండు రోజుల్లో ఈ నేతలు నామినేషన్ దాఖలు చేయనున్నారు.   

ఈ వార్తలు కూడా చదవండి

దిగొచ్చిన సీపీఐ: మూడు సీట్లు, రెండు ఎమ్మెల్సీలకు సర్ధుబాటు

కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్...సీపీఐ తాడోపేడో

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభ