ఆదిలాబాద్: కుమ్రంభీం జిల్లా  కాగజ్‌నగర్ మండలం కొత్త సర్సాల గ్రామంలో ఎఫ్ఆర్ఓ అనిత‌పై  గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న మాజీ జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మెన్  కోనేరు కృష్ణను అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఏడాది జూన్ 30వ తేదీన సర్సాల గ్రామంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఎఫ్ఆర్ఓ అనితతో పాటు అటవీశాఖాధికారులపై గ్రామస్తులు దాడికి దిగారు.  ఈ ఘటనలో జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మెన్  కృష్ణ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.

ఈ ఘటనతో ఉద్యోగులు తివ్ర నిరసన వ్యక్తం చేశారు.కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులపై కేసులు పెట్టి జైలుకు పంపారు. జిల్లా పరిషత్ వైఎస్  ఛైర్మెన్  పదవికి కృష్ణ రాజీనామా చేశారు. ఎఫ్ఆర్ఓ అనితకు రక్షణ కల్పించలేదని స్థానిక పోలీసు అధికారులపై చర్యలు తీసుకొన్నారు.

రెండు మాసాల తర్వాత కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు ఇటీవలనే బెయిల్‌‌పై విడుదలయ్యారు. కోనేరు కృష్ణ బెయిల్‌ పై  సిర్పూర్ కాగజ్ నగర్ ‌కు వచ్చే సమయంలో  టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

కోనేరు కృష్ణను అరెస్ట్ చేయడం  రిమాండ్ కు తరలించడం వంటి పరిణామాలతో  ఆయన సోదరుడు సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటవీశాఖాధికారులు గ్రామస్తులపై దాడి చేస్తే ఎవరూ కూడ పట్టించుకోలేదు, కానీ, గ్రామస్తులు అటవీశాఖధికారులపై దాడి చేస్తే మాత్రం పెద్ద ఎత్తున స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ పరిణామంతో ఈ ఏడాది ఆగష్టు 31వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి కోనేరు కోనప్ప సహా ఆయన వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు హాజరుకాలేదు. దీంతో కోనేరు కోనప్పను బుజ్జగించే పనిలో టీఆర్ఎస్ నాయకత్వం పడింది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో  సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ చాలా మంచివాడని ఆయన గుర్తు చేశారు. అటవీశాఖాధికారులపై దాడి కేసులో అరెస్టై జైలుకు వచ్చిన ఆ గ్రామ ప్రజలు కూడ ఈ ప్రకటనతో కొంత ఊరట లభించినట్టైంది.

సంబంధిత వార్తలు

కోనేరు కృష్ణ సంఘటన: ఎఫ్ఆర్వో అనితకు కేసీఆర్ షాక్...

ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిరుగుబాటు, జెడ్పీ సమావేశానికి డుమ్మా

ఎఫ్ఆర్‌ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణ సహా 16 మంది విడుదల

అనితపై దాడి: కోనేరు కృష్ణ మరిన్ని అరాచకాలు, వీడియో లీక్

ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు

సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం

బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప

వైస్ చైర్మన్ దాడి: గుర్తు చేసుకుని ఏడ్చేసిన అనిత

నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత

ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)