ఎఫ్ఆర్ఓ అనితపై దాడి కేసులో కోనేరు కృష్ణ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. బెయిల్ రావడంతో కృష్ణ సహా 15 మంది విడుదలయ్యారు.
ఆదిలాబాద్: ఎఫ్ఆర్‌ఓ అనితపై దాడి కేసులో కోనేరు కృష్ణ బెయిల్ పై గురువారం నాడు విడుదలయ్యాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సార్సా గ్రామంలో మొక్కలు నాటేందుకు భూమిని చదును చేస్తున్న అటవీశాఖాధికారులపై కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు దాడికి దిగారు.ఈ ఘటన ఈ ఏడాది జూన్ 30వ తేదీన చోటు చేసుకొంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో భాగంగా అటవీశాఖాధికారులు మొక్కలు నాటేందుకు సార్సా గ్రామానికి వెళ్లారు.మొక్కలు నాటకుండా స్థానికులు అడ్డుకొన్నారు. ఈ సమయంలోనే మాజీ జడ్పి వైఎస్ చైర్మెన్ కోనేరు కృష్ణ ఆయన అనుచరులు దాడికి దిగారు.
ఈ ఘటనపై అనిత ఫిర్యాదు మేరకు కోనేరు కృష్ణ సహా ఆయన అనుచరులు 38 మందిపై కేసు నమోదైంది. కేసు నమోదైన వారిలో కృష్ణతో పాటు మరో 15 మందిని రిమాండ్ తరలించారు. వీరు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
.ఈ కేసులో కోనేరు కృష్ణ సహా ఆయన అనుచరులకు ఇటీవలనే బెయిల్ వచ్చింది. బెయిల్ రావడంతో గురువారం నాడు కోనేరు కృష్ణ గురువారం నాడు జైలు నుండి విడుదల య్యారు.
సంబంధిత వార్తలు
అనితపై దాడి: కోనేరు కృష్ణ మరిన్ని అరాచకాలు, వీడియో లీక్
ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు
సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం
బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప
వైస్ చైర్మన్ దాడి: గుర్తు చేసుకుని ఏడ్చేసిన అనిత
నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత
ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్
ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా
నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)
మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)
