Asianet News TeluguAsianet News Telugu

8నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసిన కేసీఆర్

ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగానే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చెయ్యడం వెనుక సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూన్ 2, 2014న తెలంగాణ తొలిముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం కేసీఆర్ 4 సంవత్సరాల మూడు నెలల 4రోజుల పాటు పాలన నిర్వహించారు. మెుత్తం 1546 రోజులపాటు తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.

kcr political plan
Author
hyderabad, First Published Sep 6, 2018, 3:18 PM IST

హైదరాబాద్ : ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగానే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చెయ్యడం వెనుక సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూన్ 2, 2014న తెలంగాణ తొలిముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం కేసీఆర్ 4 సంవత్సరాల మూడు నెలల 4రోజుల పాటు పాలన నిర్వహించారు. మెుత్తం 1546 రోజులపాటు తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ పాలన పూర్తవ్వడానికి ఇంకా గడువు ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇంకా పాలనకు 8నెలు సమయం ఉండగా ముందస్తుకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 
 
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు మాత్రం సిద్ధంగా లేదు. ఇప్పటికే కేసీఆర్ ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇస్తూ సిట్టింగ్ స్థానాలకే దాదాపుగా టిక్కెట్లు ఇస్తానని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులపైనే దృష్టి సారించలేదు. 

ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించడంతో ఆ పార్టీ నేతల్లో కదలిక మెుదలైంది. 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధిక స్థానాలను కైవసం చేసుకుని అధికార పీఠాన్ని చేజిక్కించుకోగా కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీకి పరిమితమైతే తెలుగుదేశం పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.  

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీఆర్ఎస్ లోకి ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు బీజేపీ సైతం ఎన్నికలు సై అంటూనే ఉంది. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోమని ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్తోంది.  

ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగనుంది. హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీతో సఖ్యతగా ఉంది. అయితే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జ‌న‌ స‌మితి, వామ‌ప‌క్షాలు కలిసి బీహార్ రాష్ట్రంలో మ‌హాఘ‌ట్‌ బంధ‌న్ త‌ర‌హాలో మ‌హాకూట‌మిని ఏర్పాటు చేసి ఎన్నిక‌ల‌కు దిగితే ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న‌ది రాజ‌కీయ‌ పండితుల‌కు అంతు చిక్క‌డం లేదు. 

మహాకూటమి ఏర్పడాలంటే చాలా వ్యవధి కావాలి. పార్టీల సుదీర్ఘమైన చ‌ర్చ‌లు, రాజ‌కీయ‌ ప్ర‌క్రియ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చోపచర్చలు జరగాలి. కానీ ప్రతిపక్ష పార్టీలకు ఆ అవకాశం ఇవ్వకుండానే కేసీఆర్ రాజకీయ చతురతను ప్రదర్శించారు.  

ఇకపోతే 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలుగా చేసుకుని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. 
 
ఇకపోతే న‌వంబ‌ర్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛత్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఆ ఎన్నిక‌ల‌తో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ఎస్ కు సానుకూల ఫలితాలు వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది ఎన్నికల సంఘం చేతుల్లో ఉంది కాబట్టి ఎన్నికలు నవంబర్ లో నిర్వహిస్తుందా లేదా మేలో సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహిస్తుందా అన్నది వేచి చూడాలి. 

ఈ వార్తలు కూడా చదవండి

ముందస్తు: సీఎంగా కేసీఆర్ 1546 రోజుల పాలన

అసెంబ్లీ రద్దు: అపద్ధర్మ సీఎంల అధికారాలివే

అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం.. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్

ఆపద్దర్మ ప్రభుత్వ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ

 

Follow Us:
Download App:
  • android
  • ios