హైదరాబాద్:  సాధారణంగా  అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత అప్పటివరకు సీఎంగా ఉన్న వారిని కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, మంత్రవర్గాన్ని కేర్ టేకర్ గా ఉండాలని సూచించారు.

అపద్ధర్మ మంత్రివర్గం ఓటర్లను ప్రభావితం చేసే  నిర్ణయాలు కాకుండా ఇతర సాధారణ నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది.  సాధారణ  జన జీవనం ఇబ్బందులు లేకుండా  ఉండేందుకుగాను  ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు.

రాజ్యాంగంలోని 163వ అధికరణ ప్రకారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సలహా మేరకు గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ రద్దు చేయడంతో ఎమ్మెల్యేలు మాజీలుగా మారుతారు. మంత్రులు మాత్రం అపద్ధర్మ సీఎంగా కొనసాగుతారు. 

ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉండే ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండే అధికారాలపై  స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ కిందకు వచ్చే వరకు కొన్ని విషయాలు మినహాయిస్తే సాధారణ ప్రభుత్వానికి ఉండే అన్ని అధికారాలు ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉంటాయని చెప్తున్నారు.

ఈ విషయమై 1971లో యుఎన్ రావు,  ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తొంభై ఒక్క పేజీలో తీర్పులో ఆపద్ధర్మ ప్రభుత్వ అధికారాలను స్పష్టంగా ఉన్నాయి. కరుణానిధిపై కేసు విషయంలోనూ మద్రాసు హైకోర్టు మరోసారి దీనిని బలపరిచిందని చెప్తున్నారు .దీంతో ఆపద్ధర్మ ప్రభుత్వంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.