మున్సిపల్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష (వీడియో)
Sep 9, 2019, 12:12 PM ISTరెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం నాడు పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్ లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.