ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా అసెంబ్లీ రద్దుపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ నిజం చేశారు. 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ రద్దయింది. 

అసెంబ్లీ రద్దు నిర్ణయం తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ ను కలిశారు. ఈ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ ను గవర్నర్ కోరారు. ఈ  మేరకు ఆపద్దర్మ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి నోటిఫికేషన్‌ జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను అనుసరించి ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గం ఈ ఆపద్దర్మ ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఈ జీవోలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆపద్దర్మ ప్రభుత్వం పాలన సాగనుంది.

అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు జారీ చేశారు.