హైదరాబాద్: తెలంగాణ సీఎంగా కేసీఆర్  గురువారం నాటికి 1546 రోజులు పూర్తి చేసుకొన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజునే  తొలి తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణం చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేశారు. అయితే ఐదేళ్ల టర్మ్ పూర్తి చేసుకోవడానికి ఇంకా 9 మాసాలు సమయం ఉంది. అయితే  ఈ సమయాన్ని  పూర్తి చేసుకొనేలోపుగానే  ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ  వాతావరణం తనకు అనుకూలంగా ఉందని భావిస్తున్న తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్లే ప్రయోజనం ఉంటుందని  కేసీఆర్ భావిస్తున్నారు.  అయితే నిర్ణీత షెడ్యూల్ సమయంలో ఎన్నికలకు వెళ్తే  కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇచ్చినట్టుగా ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తోంది.

మరోవైపు విపక్షాలు కూడ  ఐక్యంగా లేవు. విపక్షాలు కుదురుకొనే లోపుగానే  ఎన్నికలకు వెళ్తే  రాజకీయంగా తనకు  అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా రైతు బంధు పథకం,  రైతు భీమా పథకాలను కేసీఆర్ తీసుకొచ్చారు.  అయితే ఈ రెండు పథకాల వల్ల తెలంగాణలో  రాజకీయంగా తమ పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.

అయితే  ఎన్నికల్లో ఇది రాజకీయంగా  తమకు కలిసి రానుందని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా  కేసీఆర్  2014 జూన్ 2 వ తేదీన సీఎంగా ప్రమాణం చేశారు. ఇవాళ్టికి 4 సంవత్సరాల మూడు మాసాల 4 రోజులు పూర్తైంది. 

ఇవాళ  మంచి ముహుర్తం ఉన్నందున అసెంబ్లీ రద్దు కోసం  కేసీఆర్  సెప్టెంబర్ 6వ తేదీని ఎంచుకొన్నారు. అయితే ఇవాళ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేస్తే  తెలంగాణ రాష్ట్రంలో  ఏర్పాటైన తొలి ప్రభుత్వం పూర్తి టర్మ్ పాలన పూర్తి చేయకుండానే  ముగియనుంది.