Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో అధికారంలోకి రాగానే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: రాహుల్

 తెలంగాణ కోసం రైతులు సంఘటితంగా పోరాటం చేశారని... టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో సుమారు 4 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  విమర్శించారు.  

Kcr not fulfilled election promises says rahul gandhi
Author
Kamareddy, First Published Oct 20, 2018, 4:14 PM IST

కామారెడ్డి: తెలంగాణ కోసం రైతులు సంఘటితంగా పోరాటం చేశారని... టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో సుమారు 4 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  విమర్శించారు.  వరంగల్, ఖమ్మం జిల్లాలో మద్దతు ధర అడిగిన రైతులను రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్పారు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో శనివారం నాడు నిర్వహించిన  కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  భైంసా సభ నుండి  రాహుల్ గాంధీ నేరుగా కామారెడ్డికి చేరుకొన్నారు. 

కొన్నేళ్ల క్రితం  తెలంగాణ ప్రజలు కొత్త తరహలో పాలన, కొత్త తరహలో రాష్ట్రం ఉండాలని కోరుకొన్నారు.  నీళ్లు, నిధులు,  నియామకాల కోసం  ప్రతి ఒక్కరూ పోరాటం చేశారు.  తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కోసం కాంగ్రెస్  పార్టీ కంకణం కట్టుకొని పనిచేసిందని రాహుల్ గుర్తు చేశారు. 

2014 ఎన్నికల్లో కేసీఆర్‌పై  నమ్మకం ఉండి మీరు ఓట్లు వేశారు.  తెలంగాణలోని ప్రజలంతా విశ్వసించారు. ఏ కలల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ కలలు సాకారమౌతాయని భావించాం...  కానీ, ఐదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ తెలంగాణ ప్రజల కలలు సాకారం కాలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. 

తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రం ఉంటుందని భావించారు. కేసీఆర్ పాలనను చూసిన తర్వాత అవినీతి పరుడిగా నిలిచిపోయాడని  రాహుల్ గాంధీ ఆరోపించారు.  ఒక్కటి తర్వాత ప్రాజెక్టుల  డిజైన్లను మార్చుతూ కోట్లు దండుకొంటున్నారని చెప్పారు.  అంబేద్కర్ ప్రాజెక్టు పేరును మార్చాడన్నారు.  ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదన్నారు.

తెలంగాణలోని ప్రతి వ్యక్తిపై రూ.60వేల అప్పు ఉందన్నారు. కేసీఆర్ చేసిన పాలన వల్ల రాష్ట్రం రూ.2 లక్షల కోట్ల భారం పడిందన్నారు. దుబారా ఖర్చుతో  తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన కేజీ టూ పీజీ, మిషన్ భగీరథ లాంటి పథకాల ద్వారా ప్రజలకు ఏ మేరకు అమల్లోకి వచ్చాయని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.  వంద రోజుల్లో నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని  తెరిపిస్తామని  ఇచ్చిన హామీని  కేసీఆర్ అమలు చేయలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీని కూడ అమలు చేయలేదన్నారు. కానీ, తాను నివాసం ఉండేందుకు రూ.300 కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్ ను నిర్మించుకొన్నాడని రాహుల్ గాంధీ విమర్శించారు.

కేసీఆర్, మోడీలు కూడ ఎన్నికల సమయంలో చాలా పెద్ద మాటలు వాగ్దానాలను చేశారని... కానీ, ఈ వాగ్దానాలను అమలు చేయలేదన్నారు.  తన మిత్రుడు అనిల్ అంబానీకి రాఫెల్ డీల్ ద్వారా రూ.30వేల కోట్లు కట్టబెట్టారని  రాహుల్ ఆరోపించారు.

మోడీ చేసే ప్రతి పనిని కేసీఆర్ మద్దతు పలుకుతారని చెప్పారు.  తెలంగాణ సాధన కోసం గల్ఫ్ లో ఉన్న తెలంగాణ వాసులు  పోరాడారని రాహుల్ గుర్తు చేశారు.  కానీ గల్ప్ లో ఉన్న తెలంగాణ వాసుల కోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  రూ. 2 లక్షల పంట రుణాన్ని ఒకే దఫా మాపీ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.  కర్ణాటకలో  ఏ రకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకొన్నామో... తెలంగాణలో కూడ రైతులకు పంట రుణ మాఫీని చేస్తామన్నారు.

రాష్ట్రంలో లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... కేవలం కేసీఆర్ సర్కార్ పదివేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు.

 

సంబంధిత వార్తలు

తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల పంట రుణ మాఫీ: రాహుల్

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios