హైదరాబాద్: అక్టోబర్ 20వ తేదీన  హైద్రాబాద్ చార్మినార్ వద్ద  కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ నిర్వహించతలపెట్టిన సద్భావన యాత్రకు  పోలీసులు అనుమతిని నిరాకరించారు.

ఈ నెల 20వ తేదీన తెలంగాణలోని మూడు చోట్ల  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో‌ సభలను ఏర్పాటు చేయించాలని  ఆ పార్టీ భావిస్తోంది. ఢిల్లీ నుండి వచ్చిన   రాహుల్ గాంధీ తొలుత హైద్రాబాద్ చార్మినార్ వద్ద  సభలో పాల్గొంటారు. రాజీవ్ సద్భావన యాత్ర పేరుతో ఈ సభను నిర్వహించాలని తలపెట్టారు. 

మంగళవారం నాడు  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్  రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాలు చార్మినార్ వద్ద  రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

అయితే చార్మినార్ వద్ద  రాహుల్ సద్భావన యాత్ర కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు ఇంతవరకు క్లియరెన్స్ ఇవ్వలేదు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో గతంలో ఐఎస్ఐ కదలికలు ఉన్నాయని  అధికారులు గుర్తు చేస్తున్నారు.  ఈ ప్రాంతంలో మత కల్లోలాలు చోటు చేసుకొన్నందున  ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ నేతలు ఎంచుకొన్నారు.

అయితే  ఈ సభ ఏర్పాటుకు స్థానిక పోలీసులు కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులకు మాత్రం  భరోసా ఇవ్వాల్సి ఉంది.  మరోవైపు  భైంసాలో  కూడ మత కల్లోలాలు చోటు చేసుకొన్నాయి.

మరోవైపు ఈ ప్రాంతంలోనే  గిరిజనులు, గిరిజనేతరుల మధ్య గొడవలు  చోటు చేసుకొన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని  భైంసాలో కూడ రాహుల్ సభ ఏర్పాట్లకు సంబంధించి  ఇంటలిజెన్స్ అధికారులు  ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. చార్మినార్ వద్ద  రాహుల్ గాంధీ సభ నిర్వహణ కోసం  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  స్థానిక పోలీసులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?