Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ  తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించి అదే ఊపుతో ప్రచారాన్ని కొనసాగించాలని తెలంగాణ  కాంగ్రెస్ భావిస్తోంది. 
 

aicc chief rahul tour in telangana
Author
Telangana, First Published Oct 20, 2018, 11:11 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ  తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించి అదే ఊపుతో ప్రచారాన్ని కొనసాగించాలని తెలంగాణ  కాంగ్రెస్ భావిస్తోంది. 

ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు రాహుల్ ఆదిలాబాద్ జిల్లాలోని బైంసాకు చేరుకుంటారు. అక్కడ 1.30గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత నేరుగా కామారెడ్డికి చేరుకుని 2.30కి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

కామారెడ్డి సభ తర్వాత రాహుల్ హైదరాబాద్ కు చేరుకుంటారు.  సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య చార్మినార్ వద్ద జరిగే  రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాహుల్ మళ్లీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో డిల్లీకి వెళ్లిపోనున్నారు. 

పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటనతో నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని టిపిసిసి భావిస్తోంది. ఇందుకోసం రాహుల్ బహిరంగ సభలు జరిగే జిల్లాల నుండే కాకుండా ఆ పక్కనున్న జిల్లాల నుండి భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బహిరంగ సభలు  జరిగే ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యకర్తల తరలింపు ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతోంది. 

రాహుల్ పర్యటనను విజయవంతంగా నిర్వహించి అధికార పార్టీకి గట్టి హెచ్చరికలు పంపించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం కాంగ్రెస్ నాయకులంతా సమన్వయంతో బైంసా, కామారెడ్డిలతో పాటు హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

మరిన్ని వార్తలు

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Follow Us:
Download App:
  • android
  • ios