Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల పంట రుణ మాఫీ: రాహుల్

ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  ఆరోపించారు. అవినీతితో కోట్లాది రూపాయాలను కేసీఆర్ కుటుంబం కొల్లగొడుతోందన్నారు. 
 

Congress chief Rahul gandhi slams on telangana cm kcr
Author
Adilabad, First Published Oct 20, 2018, 2:20 PM IST

భైంసా: ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  ఆరోపించారు. అవినీతితో కోట్లాది రూపాయాలను కేసీఆర్ కుటుంబం కొల్లగొడుతోందన్నారు. 

దేశం మొత్తం అంబేద్కర్ బాటలో నడుస్తోంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రం అంబేద్కర్ పేరు ఎత్తడం ఇష్టపడడం లేదని  రాహుల్ గాంధీ విమర్శించారు. అంబేద్కర్ ను కేసీఆర్ ను అవమానిస్తున్నారన్నారు

శనివారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ భైంసా నుండి ప్రారంభించారు. 

తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణాన్ని రైతులకు మాఫీ చేస్తామన్నారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ లు నిర్మిస్తామని ఇచ్చిన హామీని అమలు  చేశారా అని  ఆయన ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమిని ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని  కేసీఆర్ ను డిమాండ్ చేశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారా... ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వలేదన్నారు.

తాము చెప్పినట్టుగానే 70వేల కోట్ల రుణాలను రైతులకు మాఫీ చేసినట్టు చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి మోడీ లు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలను చేస్తున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు.

పదేళ్ల యూపీఏ పాలనలో పేద నిర్మూలన కోసం ప్రయత్నించినట్టు రాహుల్ గుర్తు చేశారు. దేశానికి సేవకుడిగా ఉంటానని  ఎన్నికల ముందు చెప్పిన మోడీ బడా కాంట్రాక్టర్లకు, సంపన్నులకు సేవకుడిగా మారాడన్నారు.

ప్రధానమంత్రి పేదలకు కాపలాదారుడిగా లేడన్నారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యాలకు సేవకుడిగా ఉన్నాడని చెప్పారు. అంబానీకి కాపలాదారుడిగా మారాడని రాహుల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

హిందూస్థాన్ ఏరోనాటికల్స్ సంస్థ అనేక యుద్ద విమానాలను తయారు చేసిందన్నారు. ఈ కంపెనీని పక్కన పెట్టి అంబానీ కంపెనీ రాఫెల్ కు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారో చెప్పాలని ఆయన మోడీని డిమాండ్ చేశారు. రూ.548 కోట్ల విమానాన్ని రూ.1600 కోట్లకు మోడీ సర్కార్ కొనుగోలు చేసిందన్నారు.  దేశానికి సేవకుడిగా ఉన్న మోడీ దొంగతనం చేస్తున్నాడని  మోడీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 

అప్పుల్లో మునిగిపోయిన వ్యక్తికి ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారో చెప్పాలన్నారు. పది రోజుల్లో కంపెనీ తెరుస్తున్న వ్యక్తికి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారో చెప్పాలని మోడీపై  రాహుల్ విమర్శలు గుప్పించారు.మోడీ చాతీ విశాలమైందే కానీ, తన కళ్లలోకి చూసే ధైర్యం ఆయనకు లేదని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలో మోడీ, తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాలను గద్దె దించుతామని రాహుల్ గాంధీ చెప్పారు.

పేద ప్రజల జేబుల్లోని డబ్బులను ధనవంతుల జేబుల్లోకి వెళ్లేలా  మోడీ ప్లాన్ చేశారని చెప్పారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరుతో  ప్రజలను ఇబ్బందుల పాల్జేశారని చెప్పారు. 

తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే  భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తామన్నారు.  గిరిజనులు, ఆదీవాసీలు సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. రైతు రుణమాఫీతో పాటు ప్రతి రైతుకు ఎకరానికి రూ. 7వేలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
 

 

సంబంధిత వార్తలు

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Follow Us:
Download App:
  • android
  • ios