హైదరాబాద్:  అక్టోబర్ 20వ తేదీన తెలంగాణలోని మూడు చోట్ల రాహుల్ గాంధీ సభలు జరగనున్నాయి ఈ మేరకు   రాహుల్ సభల ఏర్పాట్లను  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ కుంతియాలు సోమవారం నాడు పరిశీలించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఆదివారం నాడు మధ్యాహ్నం సమావేశమైంది.ఈ సమావేశంలో రాహుల్ సభల గురించి చర్చించారు.  అక్టొబర్ 20వ తేదీ ఉదయం 11 గంటలకు హైద్రాబాద్ చార్మినార్ వద్ద జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.  ఆదిలాబాద్ జిల్లా భైంసాలో జరిగే 12.45 నిమిషాలకు సభలో రాహుల్ పాల్గొంటారు.

అదే రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు  కామారెడ్డిలో జరిగే  సభలో రాహుల్ గాంధీ  పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీవర్గాలు  ప్రకటించాయి.  భైంసా,  కామారెడ్డిలలో రాహుల్ గాంధీ సభల ఏర్పాట్లను పరిశీలించేందుకు అక్టోబర్ 15వ తేదీన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ  కుంతియా  వెళ్లనున్నారు.

ఈ సభల తర్వాత అక్టోబర్ 27వ, తేదీన మరికొన్ని చోట్ల సభలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 


సంబంధిత వార్తలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?