కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.  20వ తేదీన రాహుల్  తెలంగాణ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను టీపీసీసీ గతంలో విడుదల చేసింది. తాజాగా దీనిలో స్వల్ప మార్పులు చేసింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం... రాహుల్ 20వ తేదీ మధ్యాహ్యం నాందేడ్ నుంచి భైంసా చేరుకుంటారు.. మధ్నాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత 2.30 నుంచి 3.30 గంటల వరకు కామారెడ్డి బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని.. చార్మినార్ చేరుకుని సాయంత్రం జరిగే రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రాత్రి 7 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీ తిరిగి వెళతారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు రాహుల్ ఈ పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు.