Asianet News TeluguAsianet News Telugu

రీ వెరిఫికేషన్: పాసైన విద్యార్థులకీ ఇంటర్ బోర్డు ఊరట

ఇంటర్ పరీక్షల్లో  చోటు చేసుకొన్న  అవకతవకల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఇంటర్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్,  రీ కౌంటింగ్ సమయంలో ఒక్క మార్కు ఎక్కువ వచ్చినా కూడ విద్యార్థులకు ఫీజును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకొంది.

inter board bumper offer to students
Author
Hyderabad, First Published Apr 26, 2019, 12:31 PM IST


హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో  చోటు చేసుకొన్న  అవకతవకల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఇంటర్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్,  రీ కౌంటింగ్ సమయంలో ఒక్క మార్కు ఎక్కువ వచ్చినా కూడ విద్యార్థులకు ఫీజును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకొంది.

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో  అనేక అవకతవకలు చోటు చేసుకొన్నాయనే పరిణామాల నేపథ్యంలో  ఫెయిలైన విద్యార్థులకు  ఉచితంగా  రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్  కోసం  ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇంటర్ పాసైన విద్యార్థులకు మాత్రం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం మాత్రం ఫీజును చెల్లించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయనే  ప్రచారం నేపథ్యంలో పాసైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్  చేయించుకొంటే గతంలో ప్రకటించిన మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ వస్తే పీజును తిరిగి ఇచ్చేయాలని విద్యాశాఖ సెక్రటరీ  జనార్ధన్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.రీ వెరిఫికేషన్‌లో విద్యార్థులకు మార్కులు పెరిగితే ఆ జవాబు పత్రాలను దిద్దిన అధ్యాపకుల నుండి  ఇంటర్ బోర్డు జరిమానాను వసూలు చేయాలని నిర్ణయం తీసుకొంది.

గతంతో పోలిస్తే ఈ దఫా మాత్రం రీ వెరిఫికేషన్‌ కోసం భారీగా ధరఖాస్తులు వచ్చినట్టుగా  బోర్డు అధికారులు చెబుతున్నారు.  గురువారం నాటికే సుమారు 75 వేలకు పైగా ధరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా రీ వెరిఫికేషన్‌ కోసం సుమారు 20 వేల వరకు మాత్రమే ధరఖాస్తులు వచ్చేవని ఇంటర్ బోర్డు అధికారులు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మే 15వ తేదీ నాటికి ఇంటర్ కొత్త మార్కుల లిస్టులు

ఇంటర్ బోర్డు నిర్వాకం: చెల్లని పర్చేజ్ ఆర్డర్ తో గ్లోబెరినాకు వర్క్

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ ఫలితాల గందరగోళం: ఇన్ సైడర్ టాక్

ఇంటర్ ఫలితాల గొడవ: ఎట్టకేలకు కదిలిన కేసీఆర్

విద్యాశాఖలో వివాదాలు: జగదీష్ రెడ్డి పాలిట శాపం

ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్ధిని బలవన్మరణం, 20కి చేరిన మరణాలు

సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతల యత్నం, అరెస్ట్

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

Follow Us:
Download App:
  • android
  • ios