హైదరాబాద్:ఇంటర్ ఫలితాల విషయాల్లో చోటు చేసుకొన్న వివాదాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు  క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 18వ తేదీన విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలపై అనేక వివాదాలు నెలకొన్నాయి. ఇప్పటికే 20కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.

ఈ తరుణంలో  సీఎం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి  జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ  ఆశోక్  పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్ ఫలితాలపై నెలకొన్న వివాదాలపై ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను రెండు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఈ వివాదంపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

విద్యాశాఖలో వివాదాలు: జగదీష్ రెడ్డి పాలిట శాపం

ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్ధిని బలవన్మరణం, 20కి చేరిన మరణాలు

సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతల యత్నం, అరెస్ట్

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన