తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడినప్పటికి నుండి విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తమ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గురువారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో పరీక్షలు తప్పామనే మనస్తాపంతో పలువురు విద్యార్ధులు బలవన్మరణానికి పాల్పడగా... ఎంతోమంది విద్యార్ధులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ప్రాణాలతో భయటపడ్డారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆత్మహత్యలపై ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే వరంగల్ జిల్లాలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామానికి చెందిన నవీన్ ఇంటర్ ఫస్టియర్ చదువుతన్నాడు. అయితే ఇటీవల వెలువడ్డ ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకోగా ఇతడు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో అప్పటినుండి కాస్త దిగాలుగా వుంటున్నాడు. 

తీవ్ర మనస్తాపంలో బాధపడుతున్న అతడు ఇవాళ దారుణానికి పాల్పడ్డాడు. నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు క్రింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఆత్మహత్య వెలుగుచూసింది. 

ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటర్ బోర్డు అవకతవకల మూలంగా కూడా కొంత మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీంతో ఇంటర్ బోర్డు కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు వీరి మూలంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన