Asianet News TeluguAsianet News Telugu

మే 15వ తేదీ నాటికి ఇంటర్ కొత్త మార్కుల లిస్టులు

ఆర్టీఐ ద్వారా జవాబు పత్రాలను ఇవ్వలేమని ఇంటర్ బోర్డు  తేల్చి చెప్పింది. మరో వైపు మే 15వ తేదీ నాటికి  కొత్త మార్కుల లిస్టు అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
 

new inter marks lists available from may 15
Author
Hyderabad, First Published Apr 26, 2019, 10:54 AM IST


హైదరాబాద్: ఆర్టీఐ ద్వారా జవాబు పత్రాలను ఇవ్వలేమని ఇంటర్ బోర్డు  తేల్చి చెప్పింది. మరో వైపు మే 15వ తేదీ నాటికి  కొత్త మార్కుల లిస్టు అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఎవరూ కూడ రీ వెరిఫికేషన్‌ కోసం పీజు చెల్లించాల్సిన అవసరం లేదని బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు డబ్బులు చెల్లించినవారికి తిరిగి డబ్బులు ఇవ్వనున్నట్టు బోర్డు స్పష్టం చేసింది. 

ఇంటర్ బోర్డు పరీక్ష ఫలితాల్లో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన తర్వాత రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం  కోసం ఎలాంటి ఫీజు చెల్లించవద్దని సీఎం ఆదేశించారు. ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహించాలని సీఎం ఇంటర్ బోర్డును ఆదేశించారు.

ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు రీ వెరిఫికేషన్, రీ  కౌంటింగ్ కోసం ఫీజు చెల్లించాల్సిందేనని బోర్డు తేల్చి చెప్పింది.సప్లిమెంటరీ పరీక్షల కోసం ఆయా కాలేజీల్లో  విద్యార్తులు తమ ఫీజులను చెల్లించాలని  బోర్డు కోరింది. పరీక్ష ఫీజును మాత్రం ఎవరైనా చెల్లించాల్సిందేనని బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇంటర్ పరీక్షల్లో అవకతవకలపై ఇవాళ త్రిసభ్య కమిటీ  తన నివేదికను అందించనుంది.

సంబంధిత వార్తలు

ఇంటర్ బోర్డు నిర్వాకం: చెల్లని పర్చేజ్ ఆర్డర్ తో గ్లోబెరినాకు వర్క్

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ ఫలితాల గందరగోళం: ఇన్ సైడర్ టాక్

ఇంటర్ ఫలితాల గొడవ: ఎట్టకేలకు కదిలిన కేసీఆర్

విద్యాశాఖలో వివాదాలు: జగదీష్ రెడ్డి పాలిట శాపం

ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్ధిని బలవన్మరణం, 20కి చేరిన మరణాలు

సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతల యత్నం, అరెస్ట్

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

Follow Us:
Download App:
  • android
  • ios