హైదరాబాద్‌:  ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకల కారణంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల మరో నిర్వాకం బయటపడింది. దాంతో ఇంటర్మీడియట్ విద్యార్థుల మెమోల తయారీలో జరిగిన అవకతవకలన్నింటికీ బోర్డు బాధ్యత వహించాల్సిన పరిస్థితిలో పడింది 

పరీక్షలకు సంబంధించిన సాంకేతికపరమైన పనులను నిర్వహించడానికి అవసరమైన కీలక ఒప్పందాలేవీ బోర్డు గ్లోబెరినాతో చేసుకోలేదని పరీక్షల అవకతవకలపై విచారణ జరపడానికి ఏర్పాటైన నిపుణుల కమిటీ గుర్తించినట్లు సమాచారం. 

పరీక్షల సాంకేతికపరమైన ప్రక్రియల నిర్వహణకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయలేదని, అందుకు గ్లోబెరినాతో బోర్డు సాంకేతిక, ఆర్థిక, పాలనపరమైన ఒప్పందాలు చేసుకోలేదని సమాచారం. కేవలం పర్చేజ్ ఆర్డర్ మీద గ్లోబెరినాకు పనులు అప్పగించినట్లు తెలుస్తోంది.

తాత్కాలిక నివేదిక రూపొందించడానికి నిపుణుల కమిటీ బోర్డు కార్యదర్శి ఎ. అశోక్, పరీక్ష కంట్రోలర్ అబ్దుల్ ఖలీద్, పరిపాలన సంయుక్త కార్యదర్శి భీం సింగ్ లను విచారించినట్లు తెలుస్తోంది. ఏదో కారణంతో గ్లోబెరినాతో ఒప్పందం చేసుకోవడాన్ని అధికారులు దాటవేస్తూ వచ్చారని సమాచారం. అందుకే, పని చేస్తున్న సంస్థల పేర్లను తన వెబ్ సైట్ లో పొందుపరిచిన గ్లోబెరినా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును పేరును పొందపరచలేదని తెలుస్తోంది. 

ఈ పరిస్థితిలో విద్యార్థుల మెమోలను తయారు చేయడంలో జరిగిన అవకతవకలపై గ్లోబెరినాపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండదని నిపుణులు అంటున్నారు. పర్చేజ్ ఆర్డర్ ఇవ్వడానికైనా ఒప్పందం జరగాల్సి ఉంటుందని అంటున్నారు. రాతపూర్వకమైన ఒప్పందం లేకపోతే పర్చేజ్ ఆర్డర్ చెల్లదని అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ ఫలితాల గందరగోళం: ఇన్ సైడర్ టాక్

ఇంటర్ ఫలితాల గొడవ: ఎట్టకేలకు కదిలిన కేసీఆర్

విద్యాశాఖలో వివాదాలు: జగదీష్ రెడ్డి పాలిట శాపం

ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్ధిని బలవన్మరణం, 20కి చేరిన మరణాలు

సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతల యత్నం, అరెస్ట్

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన