హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ బుధవారం నాడు ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు  సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంటర్ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ  ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారు. అయితే ఈ ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని  క్యాంప్ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

మరో వైపు ఇంటర్ బోర్డు ఎదుట కూడ విద్యార్థులు ఆందోళనను  కొనసాగిస్తున్నారు. నాలుగో రోజైన బుధవారం నాడు కూడ విద్యార్థులు  తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన