ఏదైనా సమస్య ముందుకు వచ్చినప్పుడు దాన్ని తప్పుదారి పట్టించి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే మేధావి వర్గం హవా నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవార్డుల రూపంలోనో, మరో రూపంలోనో ప్రయోజనం పొందిన వర్గం అంతటా తానై న్యాయం చెప్పే వాతావరణం నెలకొంది. ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళం విషయంలోనూ అదే జరుగుతోంది. అసలు గాయం ఒకటైతే మందు మరో చోట రాసే ప్రభుత్వ చర్యలు ఉన్నాయనే విషయం బయటకు రాకుండా ఆ మేధావి వర్గం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

మీడియా అసలు సమస్యలను పట్టించుకునే స్థితి దాటిపోయింది. ఈ తరుణంలో గొంతు విప్పడానికి సోషల్ మీడియానే వేదికగా మారింది. ఈ స్థితిలో సోషల్ మీడియాను ఆడిపోసుకోవడం ఎక్కువైంది. ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను ఒక్కటే గాటన కట్టేయడానికి తెలంగాణలోని ఐటి మేధావులు తెగ పాటు పడుతున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నోరు విప్పని చోట డిజిటల్ మీడియా గొంతు విప్పుతోంది. అదే తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. 

ఆ విషయాన్ని అలా పక్కన పెడదాం.... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వంటివారిని చూపించి మనకు ఇంకా ఆంధ్ర పెత్తందార్ల నుంచి ముప్పు తప్పలేదని మేధావి వర్గం పదే పదే చెప్పడం ద్వారా కె. చంద్రశేఖర రావు ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలిచింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవడం ద్వారా కేసీఆర్ తిరిగి అదే భూతాన్ని తెలంగాణ ప్రజలకు చూపించారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందారు. 

తెలంగాణ ఉద్యమ కాలంలోనూ ఇప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే పాడుకాలం దాపురించింది. తెలంగాణ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పడానికి, ఏదైనా జరిగితే తప్పు ప్రభుత్వానిది కాదని చెప్పడానికి డొంక తిరుగుడు పద్ధతులను ఎంపిక చేసుకున్నారు. 

చైతన్యం నలుగురితో పాటు నారాయణ అనడం వల్ల చిక్కొచ్చింది వంటి వ్యంగ్యాస్త్రం ద్వారా ఏం చెప్పలదుచుకున్నారనేది స్పష్టమే. తల్లిదండ్రులు పిల్లలను నారాయణ కాలేజీల్లో చేర్పించడం ద్వారా తప్పు చేస్తున్నారని, అదే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పదలుచుకున్నారు. 

అటువంటి వాదనే మరోటి.... ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ దళితుడు కాబట్టి రెడ్ల నాయకత్వంలో ఉన్న ఉద్యోగ సంఘాలు కుట్ర చేస్తున్నాయని మరో వాదన. ఈ వాదనలో పస ఎంత అనేది అందరికీ తెలుసు. విద్యాశాఖ మంత్రి ఏ కులానికి చెందినవాడో, ప్రభుత్వం ఏ కులాధిపత్యంతో కొనసాగుతుందో మాట్లాడడం నాకైతే సరైందని అనిపించడం లేదు. 

అదే తరహాలో.. బబ్లింగ్ వంటి అంశాల మీద కూడా మాట్లాడుతున్నారు. వాల్యూయేషన్ జరిగిన చోట తప్పులు జరిగాయని చెప్పదలుచుకున్నారు. దానికి అవసరమైన సాంకేతిక పదజాలాన్ని, వాల్యూయేషన్ ప్రక్రియను వివరించడానికి కావాల్సినంత జ్ఢానాన్ని కుమ్మరిస్తున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో నారాయణ వంటి కార్పోరేట్ కాలేజీల మీద కూడా వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థలో సమూలమైన సంస్కరణలు ఏలా చేస్తాననే విషయాన్ని కేసీఆర్ చాలా చక్కగా వివరించారు. కేసీఆర్ ప్రభుత్వమే రెండో దఫా కూడా ఏర్పడింది. ఆ సంస్కరణల విషయం ఏమైనట్లు. సరే అది కూడా అప్రస్తుతం.

విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా జరిగేవే, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆ పాపం విద్యార్థుల తల్లిదండ్రులదే అని కాసేపు అనేసి గుండెను రాయి చేసుకుందాం. కానీ, గతంలో జరగని పొరపాటు ప్రస్తుత ఫలితాల విషయంలో జరిగిందనేది స్పష్టం. ఫస్టియర్ లో తెలుగు 98 మార్కులు తెచ్చుకున్న విద్యార్థినికి సెకండియర్ లో సున్నా మార్కులు రావడాన్ని, ఐఐటి వచ్చిన విద్యార్థి లెక్కల్లో ఫెయిల్ కావడాన్ని... మెమోలో సెకండియర్ మార్కులు రావాల్సిన చోటు ఫస్టియర్ మార్కులు పడడాన్ని... పరీక్షకు గైర్హాజరు అయిన విద్యార్థులు పాస్ కావడాన్ని... అన్నింటినీ పక్కన పెడుదాం. 17 మార్కులు వచ్చిన విద్యార్థి పాస్ అయినట్లుగా మెమో రావడాన్ని ఏలా తీసుకుందామనేది ప్రశ్న. వీటిని పరిశీలిస్తే తప్పు ఎక్కడ జరిగిందనేది అర్థం కావడం లేదా అనేది మరో ప్రశ్న.

ప్రస్తుత తప్పిదాల్లో చాలా వాటికి ఓ సంస్థను వేలెత్తి చూపుతున్న వైనాన్ని తప్పు దోవ పట్టించడానికి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న మేధావులు తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రయత్నిస్తున్నారని ఎవరికైనా అనిపిస్తుంది. అసలు ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ వ్యక్తమైన ఆందోళనను తగ్గించడానికి ప్రభుత్వం నుంచి వెంటనే తగిన స్పందన వచ్చి, ఓదార్పునిచ్చే ప్రకటనలు రాకపోవడానికి బాధ్యులెవరనేది అసలు ప్రశ్న. 

రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ కోసం ప్రయత్నిస్తుంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సక్రమంగా పనిచేయడం లేదు. పైగా, ఫీజు కూడా కట్టాల్సి వస్తున్నది. రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుందామని వస్తున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డులోకి ప్రవేశం దొరకడం లేదు. మంగళవారంనాడు ఓ అమ్మాయి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కళ్ల ముందు మెదులుతూనే ఉన్నది.

పాపం... ప్రభుత్వంలో ఉన్న ఓ మేధావి, సాంకేతిక నిపుణుడు సోషల్ మీడియా పోస్టులో తెగ బాధపడిపోయారు. ఆయనను వ్యక్తిగతంగా ఎవరైనా ఏమైనా అని ఉన్నారేమో తెలియదు. ఆయన స్పందించిన తీరు మాత్రం అంత పెద్దరికంగా లేదు. చెట్టును చూసి కుక్క మొరుగుతాయి తన ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పండించారు. 

ఇవన్నీ చూస్తే.. తెలంగాణ కోసం అన్నీ వదులుకుని పనిచేసిన వారికి మండిపోదూ...

- కె. నిశాంత్

17మార్కులకు పాస్... ఇంటర్ ఫలితాల్లో మరో కోణం

తప్పుడు ప్రచారమే: ఇంటర్ మార్కుల అవకతవకలపై గ్లోబరీన్ సీఈఓ

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్థులు సహా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అరెస్ట్

ఇంటర్ విద్యార్థులకు మరో షాక్: మొరాయిస్తున్న పోర్టల్

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

విద్యార్థుల ఆత్మహత్యల పాపం ఎవరిది: హత్య (తెలుగు కథ)

అందుకే గ్లోబరిన్‌కు అప్పగించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్

ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థి సేవా దళ్ కార్యకర్తలు ధర్నా (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్: అమ్మాయి అరెస్టు (వీడియో)

ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

ఇంటర్ ఫలితాలు.... మొన్న సున్నా.. నేడు 99

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

బోర్డు నిర్వాకం: ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా

గుండె తరుక్కుపోతోంది: విద్యార్థుల ఆత్మహత్యలపై హరీష్ రావు

తప్పుల తడక: పిల్లలు ఉసురు పోసుకుంటున్న ఇంటర్ బోర్డు (వీడియో)

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం: ఐఐటీ కొట్టిన విద్యార్ధి మ్యాథ్స్‌‌లో ఫెయిల్

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య