కొడంగల్:రేవంత్ రెడ్డి ఆచూకీ తెలపాలని కోరుతూ  తన ఇంటి నుండి  రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు వెళ్తున్న  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి  భార్య గీతను పోలీసులు అడ్డుకొన్నారు.

మంగళవారం నాడు  ఉదయం తన ఇంటి నుండి  రిటర్నింగ్  అధికారిని కలిసేందుకు  బయలుదేరిన గీతను పోలీసులు  అడ్డుపడ్డారు. 144 సెక్షన్ ఉందంటూ గీతను బయటకు వెళ్లకుండా అడ్డుపడ్డారు.  144 సెక్షన్ ఉంటే  కేసీఆర్ సభకు ఎలా అనుమతి ఇచ్చారని  గీత పోలీసులను ప్రశ్నించారు.

తనతో పాటు నలుగురు మాత్రమే  రిటర్నింగ్ అధికారిని కలుస్తామని.. తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడ బయటకు రానని గీత హమీ ఇచ్చారు. 144 సెక్షన్ ఉందని రాత పూర్వకంగా  తనకు  ఆధారాలు చూపాలని  గీత పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.

రేవంత్ రెడ్డి ఆచూకీ తెలపాలని తాను రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు వెళ్తానని గీత చెప్పారు.  రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఎవరో చెప్పాలన్నారు.రేవంత్ రెడ్డి ఎక్కడున్నారో చెప్పాలని  పోలీసులను ఆమె నిలదీశారు. రేవంత్‌ను పోలీసులే అరెస్ట్‌ చేశారా? మరెవరైనా అరెస్ట్‌ చేశారా అని పోలీసులను ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయని రేవంత్‌ భార్య గీత వ్యాఖ్యానించారు.

రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు వెళ్లకుండా గీతను పోలీసులు అడ్డుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు  పెద్ద ఎత్తున  రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకొన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. ఈ సమయంలో సంయమనం కోల్పోకూడదని గీత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

 

సంబంధిత వార్తలు

రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ భారీ కుట్ర: గీత (ఆడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు