కొడంగల్:  కొడంగల్‌‌లో 144 సెక్షన్ ఉన్న సమయంలో  కేసీఆర్ సభ ఎలా అనుమతి ఇస్తారని  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భార్య గీత పోలీసులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని ఓడించేందుకు భారీ కుట్ర జరుగుతోందని గీత ఆరోపించారు. 

 మంగళవారం నాడు  కొడంగల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. కొడంగల్‌లో కేసీఆర్ సభకు  అనుమతి ఉంటే  నాకు  కూడ  అనుమతి ఇవ్వాలని  గీత ప్రశ్నించారు.  నేను కూడ సీఎం  మీటింగ్ కు వెళ్తాను తనకు అనుమతి ఇవ్వాలని ఆమె పోలీసులను కోరారు.

మీ విధులకు  మేం సహకరిస్తామని గీత పోలీసులకు చెప్పారు. తెల్లవారుజామున  బెడ్రూమ్ తలుపులను పగులగొట్టి దొంగను ఈడ్చుకెళ్లారని రేవంత్ రెడ్డి భార్య గీత చెప్పారు.

మీపై ఉన్నతాధికారుల ఒత్తిడి ఉండొచ్చు... రేవంత్ రెడ్డి  అరెస్ట్ విషయం  తప్పు కాదా అని ఆమె ప్రశ్నించారు. మేం ఐదుగురు మాత్రమే వెళ్తామంటే  144 సెక్షన్ అంటూ అడ్డు చెప్పడం సమంజసమా అని గీత ప్రశ్నించారు.

144 సెక్షన్  ఉంటే ఆ కాపీని రాతపూర్వకంగా   చూపాలని కోరారు. ఒకవేళ 144 సెక్షన్  ఉంటే  కేసీఆర్ సభకు ఎలా అనుమతి ఇస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రజాభిమానం ఉన్న  నాయకుడిని  అక్రమంగా అరెస్ట్ చేశారని  ఆమె ఆరోపించారు. 

తమ అటెన్షన్ ను డైవర్ట్ చేసి దొడ్డిదారిన టీఆర్ఎస్‌ నేతలు ఎన్నికలను తమకు అనుకూలంగా చేసుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. గ్రామాల్లోకి డబ్బులను పంపి  టీఆర్ఎస్ నేతలు  అక్రమంగా డబ్బులు వెదజల్లేందుకు ప్రయత్నాలు చేసే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా  అప్రమత్తంగా ఉండాలన్నారు. 

"

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు