Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లో చేరనున్న చెరుకు ముత్యం రెడ్డి

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  చెరుకు ముత్యం రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు

former minister muthyam reddy may join in trs on nov 20
Author
Dubbaka, First Published Nov 18, 2018, 3:44 PM IST


దుబ్బాక:మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  చెరుకు ముత్యం రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 20వ తేదీన చెరుకు ముత్యం రెడ్డి టీఆర్ఎస్‌ లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

చెరుకు ముత్యం రెడ్డి 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రెండేళ్ల క్రితం  మాజీ మంత్రి  ముత్యం రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో  ముత్యం రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొన్న సీఎం కేసీఆర్  ఆయన వైద్య సహాయం చేశారు.

ముత్యం రెడ్డి వైద్యానికి అయ్యే ఖర్చును  సీఎం సహాయ నిధి నుండి అందించారు.  ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక స్థానాన్ని ఆశించారు.దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కు కేటాయించింది.

 దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని  పలు గ్రామాల్లో మల్లన్నసాగర్  ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు ఉన్నాయి. ఈ నిర్వాసితులతో  కేసులు దాఖలు చేయించిన వారిలో కాంగ్రెస్పార్టీ నేతలు కూడ ఉన్నారని  హరీష్ రావు పలు దఫాలు విమర్శలు చేశారు. ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి  కూడ ఈ కేసులు వేయించారని హరీష్ రావు గతంలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే  ఆదివారం నాడు దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డితో పాటు మంత్రి హరీష్ రావులు  చెరుకు ముత్యం రెడ్డితో భేటీ అయ్యారు. టీఆర్ఎస్‌లో చేరాలని ముత్యంరెడ్డిని కోరారు. టీఆర్ఎస్ లో చేరేందుకు ముత్యం రెడ్డి కూడ సానుకూలంగా స్పందించారు ఈ నెల 20వ తేదీన ముత్యం రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ముత్యం రెడ్డి.

సంబంధిత వార్తలు

ఆ ఆరుగురు ఎవరో: కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదలలో ఉత్కంఠ

రాజకీయ సన్యాసం చేస్తా:కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

 

Follow Us:
Download App:
  • android
  • ios