అమరావతి: తెలంగాణలో  ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  కీలక వ్యాఖ్యలు చేశారు.హైద్రాబాద్ ను తాను ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ దాన్ని  సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాడన్నారు.

బుధవారం నాడు అమరావతిలో  రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబునాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైద్రాబాద్ నగరాన్ని తాను  సీఎం ఉన్న కాలంలో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేలా తీర్చిదిద్దినట్టు ఆయన గుర్తు చేశారు.  

కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్‌ను  సరిగా ఉపయోగించుకోవడం లేదన్నారు. తాను హైద్రాబాద్ ను  అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అమరావతిని  అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నట్టు చెప్పారు. విదేశీయులు నేరుగా  అమరావతిలో  సెటిలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

తెలంగాణలో మహా కూటమి ఏర్పాటులో టీడీపీ కీలకంగా వ్యవహరించింది.  దరిమిలా చంద్రబాబుపై  కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.  కేసీఆర్  తనపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. తాను హైద్రాబాద్‌ను కోరలేదన్నారు.