నల్గొండ: ప్రజా కూటమి( మహాకూటమి) తెలంగాణలో అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సంచలన ప్రకటన  చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని  మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వీకరించారు.

శుక్రవారం నాడు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు.మంత్రి  కేటీఆర్ విసిరిన సవాల్‌ను  కోమటిరెడ్డి స్వీకరించారు.ప్రజా కూటమి అధికారంలోకి రాకపోతే తాను  రాజకీయ సన్యాసనం చేస్తానని ప్రకటిస్తూనే.... కాంగ్రెస్ కు సవాల్ విసిరింది మంత్రి కేటీఆరా, సీఎం కేసీఆరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఎన్ని కుయుక్తులు పన్నినా కూడ  విజయం తమదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని  కోమటిరెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీయే  బీసీలకు ఎక్కువ  సీట్లను  కేటాయించిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు కేటాయింపులో టీఆర్ఎస్ మోసం చేసిందని కోమటిరెడ్డి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు