కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

జనగామ అసెంబ్లీ స్థానం నుండి  తాను  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  పొన్నాల లక్ష్మయ్య తేల్చి చెప్పారు.

why kodandaram wants janagoan assembly seat:  ponnala laxmaiah

న్యూఢిల్లీ: జనగామ అసెంబ్లీ స్థానం నుండి  తాను  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  పొన్నాల లక్ష్మయ్య తేల్చి చెప్పారు.అయితే జనగామ సీటునే  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఎందుకు అడుగుతున్నారో  చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కోదండరామ్‌ జనగామ నుండి పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉంటే  35 ఏళ్లుగా జనగామ ప్రజలను అంటి పెట్టుకొన్న  తాను ఎందుకు ఓడిపోతానని ఆయన ప్రశ్నించారు.

బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో  కూడ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేరు లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. మూడో జాబితాలో  తన పేరు ఉంటుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం నాడు  న్యూఢిల్లీలోని  ఓ తెలుగు న్యూస్‌చానెల్‌తో  పొన్నాల లక్ష్మయ్య ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందనే దిశగా  సీట్ల కేటాయింపు జరిగిందనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

తనకు సీటు కేటాయించకపోవడం వల్ల   ఆందోళన  కలుగుతోందన్నారు. మూడో జాబితాలో తన పేరు  ఉంటుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా తాను జనగామ నుండి పోటీ చేసి విజయం సాధిస్తాననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

జనగామ నుండి తాను పోటీ చేస్తే ఓటమి పాలయ్యే  పరిస్థితి ఉందనే విషయాన్ని ఈ స్థానాన్ని కోరుకొంటున్న పార్టీ నేతలు కానీ, తమ పార్టీకి చెందిన వారైనా కానీ ధైర్యంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

జనగామ నుండి తాను పోటీ చేస్తే ... కొత్తగా పార్టీ పెట్టిన వ్యక్తి ఇక్కడి నుండి పోటీ చేసి ఎలా విజయం సాధిస్తారో చెప్పాలన్నారు. ఒకవేళ తన టటమికి గల కారణాలు, కోదండరామ్ విజయానికి ఉన్న అవకాశాలు చెబితే తాను టికెట్టు అడగనని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కడి నుండో వచ్చి జనగామ నుండి పోటీ చేస్తే కోదండరామ్ కు గెలిచే అవకాశాలు ఉంటే జనగామలోనే 35 ఏళ్లుగా  పార్టీ కోసం పనిచేస్తున్న తనకు విజయం ఎందుకు దక్కదన్నారు.

జనగామ సీటునే ఎందుకు టీజేఎస్ చీఫ్ కోదండరామ్ అడుగుతున్నారో చెప్పాలన్నారు. ఆ కారణం చెబితే  తాను కూడ జనగామ సీటు అడగబోనన్నారు.
స్థానికేతరుడైన కోదండరామ్ కు జనగామ సీటు  సేఫ్ సీటైతే  స్థానికుడైన తనకు ఎందుకు సేఫ్ సీటు కాదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పొత్తులు ఉండాలని.. పొత్తులు భాగస్వామ్యపార్టీలకు ప్రయోజనం కలగాలన్నారు. పొత్తుల పేరుతో రచ్చ చేస్తే  నష్టమన్నారు పొన్నాల లక్ష్మయ్య.

సంబంధిత వార్తలు

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొగ

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios