హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను  ఆదివారం నాడు ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల  మధ్య సమన్వయం కుదరని కారణంగా ఈ సీట్ల జాబితాను ప్రకటించలేదు.

 ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని  నారాయణపేట, దేవరకద్ర, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల,హూజూరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలకు   పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించలేదు.

ఉమ్మడి  మహాబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట, దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు  ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా  ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను  ఖరారు చేయలేదు.

 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల అసెంబ్లీ స్థానానికి  కొమిరెడ్డి రాములు, జువ్వాడి నర్సింగరావులు టికెట్టు  కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ కూడ టికెట్టు విషయం వెనకడుగు వేయడం లేదు.  దీంతో ఎవరికి టికెట్టు కేటాయించాలనే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లాగుల్లాలు పడుతోంది.

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని తన కొడుకు రఘువీర్ రెడ్డికి కేటాయించాలని మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి కోరుతున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు కోసం టీజేఎస్ పట్టుబడుతోంది. టీజేఎస్ ను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మిర్యాలగూడ కోసం ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో జానారెడ్డి లాబీయింగ్ నిర్వహించారు. 

ఇదే జిల్లాలోని హుజూరాబాద్  అసెంబ్లీ స్థానం నుండి  కౌశిక్‌రెడ్డి  టికెట్టు ఆశిస్తున్నాడు. ఈ స్థానాన్ని  ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంకా ఫైనల్ చేయలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుండి  మాజీ ఎంపీ  సురేష్ షెట్కార్  టికెట్టు ఆశిస్తున్నాడు.  నామినేషన్లు దాఖలు చేసేందుకు  సోమవారం నాడు చివరి తేది కావడంతో ఈ ఆరు స్థానాల అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయ సన్యాసం చేస్తా:కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ