గత కొద్దిరోజులుగా జనగామ అసెంబ్లీ సీటు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు కనిపిస్తుంది. జనగామ టికెట్‌ మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు కన్ఫార్మ్ అయినట్లు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు అందటంతో పొన్నాల వర్గీయుల్లో ఉత్సాహం నెలకొంది.

మహాకూటమి పొత్తుల్లో భాగంగా జనగామ టికెట్‌ను టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌కు ఇస్తున్నట్లు ప్రచారం జరగడంతో పొన్నాల ఆందోళన వ్యక్తం చేశారు. లోపల ఆందోళనగా ఉన్నప్పటికీ పైకి మాత్రం జనగామ సీటు తనదేనని.. కాంగ్రెస్‌కు ఈ ప్రాంతం కంచుకోటని.. వేరే పార్టీలకు టికెట్ కేటాయించరని ఆశాభావం వ్యక్తం చేశారు.

తన లాంటి బీసీ నేతపై ఇలాంటి ప్రచారం పార్టీకి మంచిది కాదన్నారు. జనగామ సీటు మరో పార్టీకి ఇస్తే టీఆర్ఎస్‌‌కు మేలు చేసినట్లేనని... బీసీ నేత సీటును రెడ్డి వర్గానికి కేటాయిస్తే ప్రజల్లో, పార్టీలో తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో జనగామ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆదివారం చోటుచేసుకున్న పరిణామాలు కాస్తంత ఊరట కలిగించాయి. అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో రెండు రోజులుగా ఇంటికే పరిమితమైన పొన్నాల లక్ష్మయ్య ... ప్రచారానికి రెడీ అయ్యారు.

తన ప్రచార రథాన్ని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లో పర్యటింపచేశారు. మరోవైపు పొన్నాలకు టికెట్ దక్కకుండా చివరి వరకు లాబీయింగ్ చేసిన ఓ వర్గానికి హైకమాండ్ నిర్ణయం షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. 

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

తిరుమలకు పోయి సెటైర్ వేసిన పొన్నాల

పొన్నాలకు కోమటిరెడ్డి పొగ

పొన్నాల భూ కబ్జాకు పాల్పడ్డారా ?